twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఈ సారి మనసు మార్చుకుంటానేమో..నాని ట్వీట్‌పై ఆది సెటైర్స్

    |

    న్యాచురల్ స్టార్ నాని, ఆది పినిశెట్టి, నివేదా థామస్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం నిన్ను కోరి. 2017లో వచ్చిన ఈ చిత్రానికి నేటికి మూడేళ్ల పూర్తయింది. ఈ సందర్భంగా నాని తన ఉమా మహేశ్వరరావు పాత్ర తాలుకు గుర్తులను నెమరు వేసుకున్నాడు. నిన్ను కోరి చిత్రం విడుదలై మూడేళ్లు పూర్తయిన సందర్భంగా నాని చేసిన ట్వీట్‌కు ఆది ఇచ్చిన సెటైర్ అదిరిపోయింది. వీరిద్దరి ట్వీట్లు తెగ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ నాని చేసిన ట్వీట్ ఏంటో ఓసారిచూద్దాం.

    బ్రేకప్ అయిన ఉమా మహేశ్వరరావు అక్కడి నుంచి వెళ్లి మూడేళ్లు అవుతుందన్నట్టు బ్రోకన్ హార్ట్ సింబల్‌ను షేర్ చేశాడు నాని. నిన్ను కోరి షూటింగ్ లొకేషన్లలో దిగిన అప్పటి ఫోటోలను కూడా షేర్ చేశాడు. నాని చేసిన ఈ ట్వీట్‌కు ఆది అదిరిపోయే రిప్లై ఇచ్చాడు. 'హెయ్ ఉమా.. మళ్లీ నువ్ వెనక్కి రావాలి.. నీ అదృష్టాన్ని పరీక్షించుకో.. ఈ సారి నా మనసు మార్చుకుంటానేమో.. ఎప్పటికీ మరచిపోలేని ఓ అనుభవమే నిన్నుకోరి. గొప్ప టీమ్.. ' అని ఆది రిప్లై ఇచ్చాడు.

    Nani AAdhi Tweet About 3 Years For NinnuKori

    శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన నిన్ను కోరి సూపర్ హిట్‌గా నిలిచింది. ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలు అందర్నీ అలరించాయి. ఉన్నట్టుండి గుండె అనే పాట ఇప్పటికీ ఎందరికో ఫేవరేట్ సాంగ్. లవ్ అండ్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించింది. తన తొలి చిత్రంతో శివ నిర్వాణ దర్శకుడిగా ఓ గుర్తింపును తెచ్చుకున్నాడు. ఈ మూడేళ్లలో ఒకే ఒక్క సినిమా తీశాడు. మజిలీ చిత్రంతో శివ నిర్వాణ అందర్నీ ఆకట్టుకున్నాడు.

    English summary
    Nani AAdhi Tweet About 3 Years For NinnuKori. Hey uma....I think you must come come back to SFO and try your luck once again....May be ill change my mind this time Winking faceFace with tears of joy #NinnuKori was an experience that I can never forgetRed heartRed heart Great Team!!
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X