Don't Miss!
- News ఏపీలో కూటమికి వచ్చే సీట్లు ఇవే- రఘురామ తాజా అంచనా..!
- Travel నహర్‌ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- Lifestyle మనోడు ఎక్కడైనా తగ్గేదేలే అనిపించుకున్నాడు, అల్లు అర్జున్ కు అంతర్జాతీయ గుర్తింపు
- Automobiles రూ.5 లక్షల కంటే తక్కువ ధరలో బైక్ కావాలా.. ఇక్కడ చూడండి
- Finance EPFO: మీకు పీఎఫ్ ఖాతా ఉందా.. అయితే ఈ పని చేయండి..!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్‌ఫోన్..!!
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్‌కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
ఈ సారి మనసు మార్చుకుంటానేమో..నాని ట్వీట్‌పై ఆది సెటైర్స్
న్యాచురల్ స్టార్ నాని, ఆది పినిశెట్టి, నివేదా థామస్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం నిన్ను కోరి. 2017లో వచ్చిన ఈ చిత్రానికి నేటికి మూడేళ్ల పూర్తయింది. ఈ సందర్భంగా నాని తన ఉమా మహేశ్వరరావు పాత్ర తాలుకు గుర్తులను నెమరు వేసుకున్నాడు. నిన్ను కోరి చిత్రం విడుదలై మూడేళ్లు పూర్తయిన సందర్భంగా నాని చేసిన ట్వీట్‌కు ఆది ఇచ్చిన సెటైర్ అదిరిపోయింది. వీరిద్దరి ట్వీట్లు తెగ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ నాని చేసిన ట్వీట్ ఏంటో ఓసారిచూద్దాం.
బ్రేకప్ అయిన ఉమా మహేశ్వరరావు అక్కడి నుంచి వెళ్లి మూడేళ్లు అవుతుందన్నట్టు బ్రోకన్ హార్ట్ సింబల్‌ను షేర్ చేశాడు నాని. నిన్ను కోరి షూటింగ్ లొకేషన్లలో దిగిన అప్పటి ఫోటోలను కూడా షేర్ చేశాడు. నాని చేసిన ఈ ట్వీట్‌కు ఆది అదిరిపోయే రిప్లై ఇచ్చాడు. 'హెయ్ ఉమా.. మళ్లీ నువ్ వెనక్కి రావాలి.. నీ అదృష్టాన్ని పరీక్షించుకో.. ఈ సారి నా మనసు మార్చుకుంటానేమో.. ఎప్పటికీ మరచిపోలేని ఓ అనుభవమే నిన్నుకోరి. గొప్ప టీమ్.. ' అని ఆది రిప్లై ఇచ్చాడు.
శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన నిన్ను కోరి సూపర్ హిట్‌గా నిలిచింది. ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలు అందర్నీ అలరించాయి. ఉన్నట్టుండి గుండె అనే పాట ఇప్పటికీ ఎందరికో ఫేవరేట్ సాంగ్. లవ్ అండ్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించింది. తన తొలి చిత్రంతో శివ నిర్వాణ దర్శకుడిగా ఓ గుర్తింపును తెచ్చుకున్నాడు. ఈ మూడేళ్లలో ఒకే ఒక్క సినిమా తీశాడు. మజిలీ చిత్రంతో శివ నిర్వాణ అందర్నీ ఆకట్టుకున్నాడు.