అవమానపడ్డా కానీ..పగ లేదు : నాని
అలాగే...సినిమా ఫీల్డ్‌లో అస్సలు గ్యారంటీ లేదు. ఒక్క నేననే కాదు. నాలాంటి వాళ్లు చాలామంది ఉంటారు. ఇక్కడ ఎవరు, ఎప్పుడు, ఏం అవుతారనేది ఎవ్వరికీ తెలీదు. ఆ సమయంలో మా బంధువులకి, స్నేహితులకి ఇప్పుడు నేనీ స్థానంలో ఉంటానని అస్సలు అనుకుని ఉండరు. వాళ్ల స్థానంలో నేనున్నా కూడా అలా ఊహించలేను. ఇక్కడ ఎవరి తప్పూ లేదు. మనమేదో నమ్ముతాం. మనమీద మనకున్న నమ్మకం వేరేవాళ్లకు ఉండాలనుకోవడం కూడా అత్యాశే అవుతుంది అన్నారు.
ఇక నన్ను అప్పట్లో కామెంట్స్ చేసిన వాళ్లంతా...ఇప్పుడు 'మా నాని' అని చెప్పుకుంటున్నారు. అయినా నేను వాళ్లనేమీ తప్పుగా అనుకోవడం లేదు. ఓ రకంగా వాళ్ల కామెంట్సే నాకు డ్రైవింగ్ ఫోర్స్ అయ్యాయేమో అనిపిస్తుంది. లైఫ్ ఎప్పుడూ కంఫర్ట్ జోన్‌లో ఉంటే మనమూ లేజీగా తయారైపోతాం. ఇలా మన గురించి అందరూ తక్కువ అంచనా వేస్తుంటే, ఏదో ఒక రకంగా ప్రూవ్ చేసుకోవాలనే కసి మొదలవుతుంది. ఓ రకంగా నేను ఈ ప్లేస్‌లో ఉండడానికి అందరూ ఉపయోగపడ్డారు. అందుకే వాళ్లందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి అని వివరించారు.
ప్రస్తుతం నాని .. కృష్ణ వంశీ దర్శకత్వంలో 'పైసా' చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రంలో కేథరిన్, లక్కీ శర్మ హీరోయిన్లుగా చేస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ఈచిత్రంలో నాని యంగ్ పొలిటీషియన్‌గా కనిపించబోతున్నాడు. దర్శకుడు కృష్ణ వంశీ పాటల చిత్రీకరణలో తన క్రియేటివిటీ చూపిస్తున్నారు. నిర్మాతలు కూడా ఆయన క్రియేటివిటీకి తగిన విధంగా భారీగా ఖర్చు పెడుతున్నారు. కేవలం పాటల చిత్రీకరణ కోసం దాదాపు కోటికిపైగా వెచ్చించినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications












