నేను హీరోని కాదు అంటున్నాడు

అలాగే పాత్రల మధ్య సంఘర్షణే ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. 'సెగ' అనగానే ఇదేదో ప్రేమ కథా చిత్రమనే నిర్ణయానికి రావొద్దు. మురికివాడల్లోని మధ్య తరగతి జీవితాలే ఈ కథకు నేపథ్యం. ప్రేమతోపాటు పలు అంశాలకి ఇందులో చోటుంది. ప్రతి సన్నివేశం భావోద్వేగాలను రేకెత్తిస్తుంది. మనం సినిమా చూస్తున్నామనే విషయం ఎప్పుడూ గుర్తుకు రాదు అన్నారు.
ఇక ఎవరైనా స్క్రిప్ట్ సిద్ధం చేసుకొన్నాక వచ్చి కథ చెబుతారు. 'సెగ' విషయంలో మాత్రం అలా జరగలేదు. స్క్రిప్ట్‌లోని ప్రతి సన్నివేశంతోనూ నేను ప్రయాణించాను. ఈ చిత్రంతో నా అనుబంధం ప్రత్యేకమైనది. దర్శకురాలు అంజన నాకు స్నేహితురాలు కావటంతో... తనకు ఈ కథ ఆలోచన తట్టిన మొదటి క్షణం నుంచీ మేమిద్దరం కలిసి పనిచేశాం అన్నారు. బెస్ట్ ఆప్ లక్ నాని.


Click it and Unblock the Notifications