నాగ్, నాని సినిమా మొదలైంది.. చాలా ఎక్సైటింగ్‌గా ఉంది.. శ్రీరాం ఆదిత్య
అక్కినేని నాగార్జున, నేచురల్ స్టార్ నాని కాంబినేషన్‌లో వస్తున్న మల్టీస్టారర్ చిత్ర షూటింగ్ ప్రారంభమైంది. ఉగాది సందర్భంగా హైదరాబాద్‌లో షూటింగ్‌ను ఆరంభించారు. శమంతకమణి చిత్రానికి దర్శకత్వం వహించిన శ్రీరాం ఆదిత్య డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.

ఈ సందర్భంగా డైరెక్టర్ శ్రీరాం ఆదిత్య మాట్లాడుతూ.. నాగార్జున సార్ సినిమాలు చేస్తూ పెరిగాను. అలాంటిది ఆయనతో పనిచేయడం చాలా ఎక్సైటింగ్‌గా ఉంది. నా కంటే సీనియర్ డైరెక్టర్లు ఉన్నప్పటికీ నాకే ఆ అవకాశం రావడం ఇంకా ఆనందంగా ఉంది. నానితో సినిమా చేయాలని చాలా రోజుల నుంచి అనుకొన్నాను. అది ఈ సినిమాతో తీరింది. చాలా వినోదభరితంగా సినిమా ఉంటుంది.


Click it and Unblock the Notifications











