Dasara Twitter Review: దసరాకు ఊహించని టాక్.. అదే పెద్ద మైనస్ కానీ.. మరి నాని హిట్ కొట్టాడా అంటే!

తెలుగు సినీ ఇండస్ట్రీలో సహజ సిద్ధమైన నటనతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుని.. సుదీర్ఘ కాలంగా టైర్ 2లో టాప్ హీరోగా వెలుగొందుతోన్నాడు నేచురల్ స్టార్ నాని. హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తోన్న అతడు.. తన గత చిత్రంతో నిరాశ పరిచాడు. దీంతో ఈ సారి గట్టిగానే కొట్టాలని డిసైడ్ అయిపోయాడు. ఇందులో భాగంగానే ఇప్పుడు నాని 'దసరా' అనే మాస్ మసాలా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ చిత్రానికి ట్విట్టర్‌లో ఎలాంటి టాక్ వచ్చిందో మీరు కూడా చూసేయండి మరి!

దసరా అంటూ నాని ప్రయోగం

దసరా అంటూ నాని ప్రయోగం

టాలెంటెడ్ స్టార్ నాని హీరోగా.. శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన మాస్ మసాలా చిత్రమే 'దసరా'. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించింది. దీన్ని ఎస్‌ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. సంతోష్ నారాయనణ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ సినిమాలో దీక్షిత్ శెట్టి, సముద్రఖని, సాయి కుమార్, పూర్ణ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు.

అలాంటి కథ.. పాన్ ఇండియా

అలాంటి కథ.. పాన్ ఇండియా

బొగ్గు గనుల్లో పని చేసుకునే ఓ సాధారణ వ్యక్తి.. అమ్మాయి విషయంలో తలెత్తిన గొడవల వల్ల అంగ బలం, అర్థిక బలం, రాజకీయ పలుకుబడి ఉన్న విలన్ గ్యాంగ్‌ను ఎదుర్కొనే అంశాలతో 'దసరా' మూవీ తెరకెక్కినట్లు తెలిసింది. పక్కా మాస్ మసాలా కథతో రాబోతున్న ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో విడుదల అయింది.

అక్కడ బూతులతోనే సినిమా

మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'దసరా' మూవీ ఎంతో గ్రాండ్‌గా విడుదల అయింది. ఇప్పటికే యూఎస్ సహా చాలా ప్రాంతాల్లో షోలు కూడా ప్రదర్శితం అయ్యాయి. ఇప్పటి వరకూ వచ్చిన రిపోర్టుల ప్రకారం.. ఈ సినిమాకు అన్ని చోట్లా మంచి టాక్ వచ్చింది. ఇక, ఇండియాలో 36 కట్స్ తెచ్చుకున్న ఈ మూవీ.. యూఎస్‌లో సెన్సార్ లేకుండానే ప్రదర్శితం అవుతుందని తెలిసింది.

ఫస్టాఫ్ ఎలా ఉందో చెబుతూ

నాని నటించిన 'దసరా' మూవీని వీక్షించిన ఓ నెటిజన్ ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. ఇందులో 'దసరా ఫస్టాఫ్ పూర్తైంది. వావ్ వావ్ వావ్.. ఇది మరొక స్థాయికి వెళ్లిన మాస్ మూవీ. కానీ, ప్రజెన్స్ కాస్త తగ్గింది కానీ.. అతడు కనిపించినప్పుడల్లా అరిపించేశాడు. ఇంటర్వెల్ మాత్రం అదిరిపోయింది. నాని విస్పోటనం గురించి వెయిటింగ్' అని రాసుకొచ్చాడు.

చక్కటి క్లైమాక్స్‌తో బతికింది

'దసరా' సినిమాను చూసిన మరో నెటిజన్ ట్విట్టర్‌లో స్పందిస్తూ.. 'దసరా మూవీ చక్కని గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన డ్రామా అని చెప్పొచ్చు. ఇది చాలా స్లోగా సాగినా.. కొన్ని చోట్ల సాగదీసినట్లు అనిపించినా.. మంచి సన్నివేశాలు.. అదిరిపోయే క్లైమాక్స్‌తో చాలా వరకూ సంతృప్తిని ఇచ్చింది. ఇది నానికి కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్. నా రేటింగ్ 2.75-3/5' అని చెప్పాడు.

డైరెక్టర్ పాస్.. అతడు ఫెయిల్


నాని - కీర్తి సురేష్ నటించిన 'దసరా' సినిమాను చూసిన ఇంకో నెటిజన్ ట్విట్టర్‌లో 'శ్రీకాంత్ ఓదెల తెలుగు సినీ ఇండస్ట్రీలో గొప్ప డైరెక్టర్ అయ్యే పొటెన్షియాలిటీ ఉన్న దర్శకుడు. ఈ చిత్రంలో సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. అయితే, సంగీత దర్శకుడు మాత్రం ఎలివేట్ చేయగలిగిన సన్నివేశాలను చక్కగ చేయడంలో విఫలం అయ్యాడు' అంటూ చెప్పుకొచ్చాడు.

గుడినే కట్టేస్తారు అంటూ

నాని నటించిన 'దసరా' సినిమాను చూసిన మరో నెటిజన్ ఇలా స్పందించాడు. ఈ మేరకు ట్విట్టర్‌లో 'మొత్తం సినిమాలు చివరి 30 నిమిషాల్లో వచ్చే క్లైమాక్స్ మాత్రం వేరే లెవెల్ అన్నా. నాని అన్నది ఏమన్నా యాక్టింగా.. ఫ్యాన్స్ నీకు గుడి కట్టేస్తారు. ఇది ఫ్యాన్స్ కోసమే తీసినట్లు ఉంది. ఆ క్లైమాక్స్‌లో బ్యాగ్రౌండ్ స్కోర్ అరాచకం అంతే' అంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

మొత్తం సినిమా బాగుందని

మొత్తం సినిమా బాగుందని


'దసరా' సినిమాను తిలకించిన మరొక నెటిజన్ ట్విట్టర్‌లో స్పందిస్తూ.. 'దసరా ఫస్టాఫ్ చాలా బాగుంది. ధరణి పాత్రలో నాని అద్భుతమైన నటన కనబరిచాడు. సూరి, ధరణి మధ్య ఫ్రెండ్‌షిప్ చక్కగా చూపించారు. ఇంటర్వెల్ అదుర్స్. రెండో సగం స్లోగా ఉన్నా క్లైమాక్స్ సీన్ సూపర్. ఇందులో పాటలు, బ్యాగ్రౌండ్ స్కోర్ సంతృప్తికరంగానే ఉన్నాయి' అంటూ వెల్లడించారు.

దసరాకు ఫైనల్ టాక్ ఏంటంటే

దసరాకు ఫైనల్ టాక్ ఏంటంటే


నాని నటించిన 'దసరా' మూవీకి సంబంధించి ఇప్పటి వరకూ చూసిన ట్వీట్లను బట్టి చూస్తే దీనికి మొత్తంగా మంచి టాకే వచ్చింది. చాలా మంది ఈ సినిమా బాగుందనే చెప్తున్నారు. అయితే, సెకెండాఫ్‌లో మాత్రం కొంచెం స్లో అవడం పెద్ద మైనస్ అంటున్నారు. కానీ, క్లైమాక్స్ వల్ల అది ఎఫెక్ట్ కాలేదని చెబుతున్నారు. ఫైనల్‌గా అన్ని వర్గాలు వాళ్లూ ఈ సినిమా చూడొచ్చన్న మాట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X