ఓటీటీలో విడుదలైన ఆ రెండు సినిమాలు మళ్ళీ థియేటర్స్ లోకి..
కరోనా కష్టకాలంలో థియేటర్స్ ఓపెన్ అవుతాయనే నమ్మకంతో కొందరు నిర్మాతలు చాలా రోజుల వరకు ఓపిక పట్టారు. ఇక చివరికి ఓటీటీలో మంచి ఆఫర్స్ రావడంతో ఆలస్యం చేస్తే ఇంతకంటే మంచి ఆఫర్ దొరకదని ఓటీటీలోనే డైరెక్ట్ గా రిలీజ్ చేశారు. అందులో నాని V సినిమా, అలాగే రాజ్ తరుణ్ 'ఒరేయ్ బుజ్జిగా' కూడా ఉన్నాయి. అయితే రెండు సినిమాలు కూడా ఓటీటీలో కూడా పెద్దగా పాజిటివ్ టాక్ ను అందుకోలేకపోయాయి.
ఇక ఇప్పుడు ఏమనుకున్నారో ఏమో గాని మళ్ళీ థియేట్రికల్ రిలీజ్ కు సిద్ధమయ్యారు. మరికొన్ని రోజుల్లో దాదాపు థియేటర్స్ అన్ని కూడా తెరచుకొనున్నాయి. ముందుగా సోలో బ్రతుకే సో బెటర్ సినిమా భారీ స్థాయిలో రిలీక్ కాబోతోంది. 9 నెలల తరువాత రిలీజ్ కాబోతున్న పెద్ద సినిమా ఇదే. ఇక ఆ తరువాత వరుసగా మిగతా సినిమాలు సంక్రాంతిని టార్గెట్ చేయడానికి సిద్ధమయ్యాయి. అయితే వాటికంటే ముందు ఓటీటీ సినిమాలు ఆడియెన్స్ ను ఎట్రాక్ట్ చేయడానికి సిద్ధమయ్యాయి.

నాని, సుధీర్ బాబు నటించిన యాక్షన్ మూవీ జనవరి1న రిలీజ్ అవుతుండగా అలాగే రాజ్ తరుణ్ నటించిన రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ డిసెంబర్ 31న విడుదల కానుంది. ఓటీటీలో చూడని నార్మల్ ఆడియెన్స్ థియేటర్ ఫీలింగ్ కోసం సినిమా కోసం వస్తే ఎంతో కొంత కలెక్షన్స్ వస్తాయని ఆశపడుతున్నారు. మరి ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వసూళ్లను అందుకుంటాయో చూడాలి. ఈ సినిమా తరువాత మళ్ళీ సంక్రాంతి హాలిడేస్ లో వరుసగా క్రాక్, రెడ్, బంగారు బుల్లోడు సినిమాలు విడుదల కానున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











