INDvsAUS Final: వరల్డ్‌కప్‌ ఫైనల్ మ్యాచ్‌లో నాని, సల్మాన్ ఖాన్.. కామెంట్రీ మాత్రమే కాదు.. అంతకు మించి!

దేశ ప్రజలంతా ఉత్కంఠగా ఎదురు చూస్తోంది.. ఒక్క నిమిషం కూడా ఫోన్ లు, టీవీలు పక్కన పెట్టకుండా సామాన్య ప్రజలంతా వరల్డ్ కప్ వైపే చూస్తున్నారు. ఇండియా కప్పు కొడుతుందా లేదా అని తెగ ఆసక్తిగా చూస్తుండగా.. వేలాది మంది నేరుగా మ్యాచ్ చూసేందుకు వెళ్లారు. ప్రస్తుతం అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ ను చూసేందుకు సామాన్య ప్రజలతో పాటు చాలా మంది సినీ సెలబ్రిటీలు కూడా వెళ్లారు. టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా అనేక మంది స్టేడియంలో సందడి చేస్తున్నారు. కొందరు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి మరీ రచ్చ చేస్తున్నారు.

ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీతో కలిసి వెళ్లగా.. అఖిల్ అక్కినేని, విక్టరీ వెంకటేష్, న్యాచురల్ స్టార్ నానిలు కూడా వెళ్లారు. అలాగే బాలీవుడ్ స్టార్ హీరోలు షారుఖ్ ఖాన్, రణ్ వీర్ సింగ్, దీపికా పదుకొణె, అనుష్క శర్మ, అథియా శెట్టిలు కూడా స్టేడియంలో దర్శనం ఇచ్చారు. అయితే వీరంతా ఒక్కో చోట కూర్చొని కనిపించగా.. టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని, బాలీవుడ్ టాప్ హీరో సల్మాన్ ఖాన్ లు మాత్రం ఒకే ఫ్రేములో కనిపించారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు వీరిద్దరూ కలిసి ఫొటోలు దిగారు.

Nani And Salman Khan Special Commentry in World Cup Match Check Details

అంతే కాదండోయ్ వీరిద్దరూ కలిసి కామెంటరీ రూంలో కూర్చొని ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తున్నారు. నాని తెలుగులో కామెంట్రీ చేస్తుంటే సల్మాన్ ఖాన్ హిందీలో కామెంట్రీ చేస్తున్నారు. ఈక్రమంలోనే వీరిద్దరూ కలిసి దిగిన ఫొటోలు నెట్టింట ఫుల్ వైరల్ గా మారాయి. ఇద్దరూ సింగిల్ ఫ్రేములో కనిపిస్తుంటే చాలా బాగుందంటూ నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. కేవలం కామెంట్రీ మాత్రమే కాదండోయ్ వీరిద్దరూ సెపరేట్ గా చేసిన తాజా చిత్రాలను కూడా ప్రమోట్ చేసుకుంటున్నారు.

న్యాచురల్ స్టార్ నాని హీరోగా రాబోతున్న హాయ్ నాన్న చిత్రానికి వినూత్నంగా ప్రమోషన్లు చేస్తున్నారు. ఇటీవలే రాజకీయ నాయకుడిలా కనిపించి మేనిఫెస్టో అంటూ సినిమాకు సంబంధించిన విషయాలు చెప్పగా... తాజాగా వరల్డ్ కప్ మ్యాచ్ లో కామెంట్రీ చేస్తూ సనిమాను ప్రమోట్ చేసుకోవడం గమనార్హం. శౌర్యువ్ దర్శకత్వంలో మృణాల్ ఠాకూర్ కథానాయికగా వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది

మరోవైపు సల్మాన్ ఖాన్ హీరోగా తాజాగా వచ్చిన చిత్రం టైగర్ 3. నవంబర్ 12వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదలై బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్సు వసూలు చేస్తున్న ఈ సినిమాను సల్మాన్ ఖాన్ ఇప్పటికీ ప్రమోట్ చేస్తున్నారు. ప్రస్తుతం వరల్డ్ కప్ మ్యాచ్ కోసం అహ్మదాబాద్ వెళ్లిన ఈయన.. స్టేడియంలో కామెంట్రీతో పాటు తన సినిమాను కూడా ప్రమోట్ చేసుకుంటున్నారట. ఓవైపు క్రికెట్ గురించి చెబుతూ.. మరోవైపు తన సినిమా గురించి కూడా ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X