టక్ జగదీష్ ఆ సినిమాకు కాపీ.. రూమర్లపై నాని, శివ నిర్వాణ క్లారిటీ

వరుస విజయాలతో దూసుకెళ్తున్న నేచురల్ స్టార్ నాని త్వరలోనే టక్ జగదీష్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. నిన్నుకోరి, మజిలీ లాంటి చిత్రాలను అందించిన శివ నిర్వాణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. టక్ జగదీష్‌కు సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలు జోరుగా ప్రారంభమయ్యాయి. అయితే టక్ జగదీష్‌కు మంచి హైప్ వస్తున్న సమయంలో ఈ సినిమాను కొన్ని రూమర్లు చుట్టుముట్టాయి. ఆ రూమర్లపై శివ నిర్వాణ స్పందిస్తూ...

రాజమండ్రిలో పరిచయ వేదిక తర్వాత

రాజమండ్రిలో పరిచయ వేదిక తర్వాత

టక్ జగదీష్‌ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్‌కు సిద్దమైంది. రాజమండ్రిలో పరిచయ వేదిక అంటూ ఈ సినిమా ప్రమోషన్స్ ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి భారీగా అభిమానులు తరలిరావడంతో టక్ జగదీష్‌కు మంచి ఊపు వచ్చింది. ఈ సందర్భంగా మీడియాతో నాని, శివ నిర్వాణ, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మాట్లాడుతూ కొన్ని విషయాలపై క్లారిటీ ఇచ్చారు.

ఆ సినిమాకు కాపీ అంటూ రూమర్లు

ఆ సినిమాకు కాపీ అంటూ రూమర్లు

టక్ జగదీష్ సినిమా గతంలో వచ్చిన బలరామకృష్ణుల అనే సినిమాకు రీమేక్ అని, స్పూర్తి అని, కాపీ అనే మాటలు మీడియాలో వినిపించాయి. ఇలాంటి వార్తలపై దర్శకుడు శివ నిర్వాణ, నాని స్పందించారు. టక్ జగదీష్ ఏ సినిమాకు కూడా స్పూర్తి కాదు అనే విషయాన్ని స్పష్టం చేశారు. వెబ్ మీడియాలో ఇలాంటి వార్తలను రాయడం మానుకోవాలని సూచించారు.

 వివాదంపై స్పందించిన శివ నిర్వాణ

వివాదంపై స్పందించిన శివ నిర్వాణ

బాలరామకృష్ణులు అనే వివాదంపై శివ నిర్వాణ ఘాటుగా స్పందించారు. టక్ జగదీష్ సినిమాకు 50 ఏళ్ల ముందు అన్నదమ్ముల కథతో చాలా సినిమాలు వచ్చాయి. మా తర్వాత మరో 50 ఏళ్లకు కూడా అన్నదమ్ముల సినిమాలు వస్తూనే ఉంటాయి. కుటుంబ కథా చిత్రాలంటే తల్లిదండ్రులు, అన్నాదమ్ముల మధ్య ఉండే ఎమోషన్స్ మీదే స్టోరీలు ఉంటాయి అని చెప్పారు.

 అల వైకుంఠపురంలో పాటను కాపీ కొట్టారంటూ

అల వైకుంఠపురంలో పాటను కాపీ కొట్టారంటూ

అలాగే టక్ జగదీష్ టీజర్ కూడా అల వైకుంఠపురం సినిమాలోని ఓ పాటకు కాపీ అని అనడంపై కూడా నాని, శివ నిర్వాణ స్పందించారు. ఇలాంటి వార్తలు మా దృష్టికి కూడా వచ్చాయి. కోడిపుంజు, సంక్రాంతి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు జరుపుకొనే సంప్రదాయాలు. వాటిని మన నేటివిటికి తగినట్టుగా చూపించడం తప్పుకాదు. ఒక సినిమాలో చూపిస్తే.. మళ్లీ చూపించడం తప్పు కాదుగా అనే విధంగా మాట్లాడారు.

 మజిలీ కథ విషయంలో కూడా రూమర్లు

మజిలీ కథ విషయంలో కూడా రూమర్లు

గతంలో కూడా మజిలీ సినిమా విషయంలో ఇలాంటి వార్తలే వచ్చాయి. సమంత, నాగచైతన్య జంటగా అని చెబితే.. పలు సినిమాల పేర్లను జోడించి గాసిప్స్ రాశారు. ఆ సినిమా తర్వాత ఆ కథ ఏ సినిమాకు సంబంధించింది కాదని స్పష్టమైంది. ఇప్పుడు కూడా టక్ జగదీష్ చూసిన తర్వాత అసలు విషయం మీడియాకు, ప్రేక్షకులకు తెలియడం ఖాయం అంటూ శివ నిర్వాణ వెల్లడించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X