Ante Sundaraniki Twitter Review: నాని మూవీకి ఊహించని టాక్.. అదే బిగ్ మైనస్.. ఫైనల్ రిపోర్ట్ ఏంటంటే!

తెలుగు సినీ ఇండస్ట్రీలో టాలెంట్ ఉన్న హీరోలు చాలా మందే ఉన్నారు. అందులో అందరి కంటే ముందుగానే చెప్పుకోవాల్సిన పేరు నేచురల్ స్టార్ నాని. స్వయంకృషితో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అతడు.. సహజ సిద్ధమైన నటనతో ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించాడు. అలాగే, మొదట్లోనే ఎన్నో విజయాలను సొంతం చేసుకుని కమర్షియల్ హీరోగా ఎదిగిపోయాడు. అప్పటి నుంచి మరింత ఉత్సాహంతో సినిమాల మీద సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు నాని 'అంటే.. సుందరానికీ!' అనే సినిమా చేశాడు. తాజాగా విడుదలైన ఈ మూవీకి ఎలాంటి టాక్ వచ్చింది? నాని ఖాతాలో హిట్ పడిందా లేదా? అసలు దీని గురించి ట్విట్టర్‌లో ఎలాంటి కామెంట్లు వస్తున్నాయి? అనే అంశాలు చూద్దాం పదండి!

Recommended Video

Ante Sundaraniki Movie Genuine Review *Reviews | Telugu Filmibeat
అంటే.. అంటూ వచ్చేసిన నాని

అంటే.. అంటూ వచ్చేసిన నాని

నేచురల్ స్టార్ నాని - వివేక్ ఆత్రేయ కాంబినేషన్‌లో రూపొందిన చిత్రమే ‘అంటే.. సుందరానికీ!'. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ మూవీలో నజ్రియా నజీమ్ హీరోయిన్‌గా చేసింది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై న‌వీన్ ఎర్నేని, ర‌విశంక‌ర్ య‌ల‌మంచిలి నిర్మించారు. వివేక్ సాగర్ దీనికి సంగీతం అందించాడు. ఇందులో చాలా మంది ప్రముఖులు నటించారు.

అలాంటి కథ.. అంచనాలతోనే

అలాంటి కథ.. అంచనాలతోనే


‘అంటే.. సుందరానికీ!' మూవీ ఒక బ్రాహ్మణ కులానికి చెందిన హీరో.. క్రిస్టియన్ అమ్మాయి ప్రేమలో పడడం.. వీళ్ల పెళ్లిని పెద్దలు ఒప్పుకోకపోవడం.. చివర్లో హీరోకు ఏదో సమస్య ఉందని తెలిసిపోవడం వంటి విభిన్నమైన అంశాలతో తెరకెక్కింది. అలాగే, ఇందులో హీరో నానికి ఏదో సమస్య ఉందని సస్పెన్స్‌గా ఉంచేసి ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో పెంచేశారు.

బిజినెస్ తగ్గట్లుగానే విడుదల

బిజినెస్ తగ్గట్లుగానే విడుదల

నేచురల్ స్టార్ నాని నటించిన ‘అంటే.. సుందరానికీ!' మూవీ నైజాంలో రూ. 10 కోట్లు, సీడెడ్‌లో రూ. 4 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 10 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 24 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, రెస్టాఫ్ ఇండియాలో రూ. 3.50 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 2.50 కోట్లతో కలిపి రూ. 30 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, గ్రాండ్‌గా విడుదల అవుతోంది.

నాని మూవీకి ఊహించని టాక్

నాని మూవీకి ఊహించని టాక్

నాని - నజ్రియ నజీమ్ జంటగా నటించిన ‘అంటే.. సుందరానికీ!' మూవీ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇప్పటికే యూఎస్ సహా ఇండియాలోని చాలా ప్రాంతాల్లో షోలు ప్రదర్శితం అయిపోయాయి. అన్ని ఏరియాల్లోనూ ఈ సినిమాకు ఊహించని విధంగా మిక్స్‌డ్‌ టాక్ వచ్చింది. ఇది బాగుందని కొందరు, పర్వాలేదని ఇంకొందరు అంటున్నారు.

ఫస్టాఫ్ ఇలా... సెకెండాఫ్ ఇలా

ఫస్టాఫ్ ఇలా... సెకెండాఫ్ ఇలా


‘అంటే.. సుందరానికీ!' మూవీ ఓవరాల్‌గా చూసుకుంటే ఫస్టాఫ్ మొత్తం ప్రేక్షకులను కథలోకి తీసుకెళ్లడానికి చాలా సమయం తీసుకున్నాడట దర్శకుడు. పాత్రలను పరిచయం చేయడం.. వాళ్ల వెనుక నేపథ్యాన్ని చూపించడానికే ఎక్కువ సమయం పట్టిందట. అయితే, సెకెండాఫ్ మాత్రం అదిరిపోయే కామెడీతో అలరించే విధంగా తీశాడట. మొత్తంగా రెండో సగమే బాగుందట.

సినిమా ప్లస్‌... మైనస్‌లు ఇవే

సినిమా ప్లస్‌... మైనస్‌లు ఇవే

‘అంటే.. సుందరానికీ!' మూవీని చూసిన వాళ్లంతా చేసిన ట్వీట్ల ప్రకారం.. ఇందులో నాని, నజ్రియా యాక్టింగ్ ఇరగదీసేశారట. అలాగే, వన్ లైన్ కామెడీ డైలాగ్స్, బ్యాగ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీలు ఈ సినిమాకు ప్లస్ అంటున్నారు. అయితే, ఫస్టాఫ్, పాటలు, ఎమోషన్స్ పండకపోవడం, సినిమా నిడివి ఎక్కువగా ఉండడం ఈ సినిమాకు మైనస్‌గా మారాయని చెప్తున్నారు.

మొత్తంగా మూవీ ఎలా ఉంది

మొత్తంగా మూవీ ఎలా ఉంది

తాజా సమాచారం ప్రకారం.. నేచురల్ స్టార్ నాని నటించిన ‘అంటే.. సుందరానికీ!' మూవీ భావోద్వేగాలతో కూడిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ అని అంటున్నారు. అయితే, ఈ సినిమా నిడివి దాదాపు మూడు గంటల పాటు ఉండడంతో ప్రేక్షకులు బోర్ ఫీలయ్యే అవకాశం ఉందట. అయినప్పటికీ నాని, నజ్రియా అదిరిపోయే నటనతో పాటు కామెడీ కోసం సినిమా చూడొచ్చని టాక్.

అదే పెద్ద మైనస్ అంటూనే

అదే పెద్ద మైనస్ అంటూనే


‘అంటే.. సుందరానికీ!' మూవీలో నిడివి (Run Time) ఎక్కువగా ఉందని మొదటి నుంచీ ప్రచారం జరుగుతూనే వచ్చింది. అయితే, నాని సినిమా కావడంతో ఆ ఫీలింగ్ ప్రేక్షకులకు రాదని అంతా అనుకున్నారు. అయితే, ఊహించని విధంగా ఈ సినిమాకు అదే పెద్ద మైనస్‌గా మారిందని సినిమాను చూసిన వాళ్లు చెప్తున్నారు. మరి దర్శకుడు దీనిపై ఎందుకు దృష్టి పెట్టలేదో మరి!

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X