twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘నిన్ను కోరి’ విషయంలో తప్పుగా ఆలోచించాం: క్షమాపణలు చెప్పిన నాని

    నిన్ను కోరి చిత్రం విషయంలో నాని క్షమాపణలు చెప్పారు. మాస్ ఆడియన్స్ ను తక్కువగా అంచనా వేశామన్నారు.

    By Bojja Kumar
    |

    'నిన్ను కోరి' సినిమా విషయంలో నాని మాస్ ఆడియన్స్ కు క్షమాపణలు చెప్పారు. ఆ మధ్య ఎవరో అడిగినపుడు నిన్ను కోరి సినిమా ఎలా ఉండబోతోంది అంటే సిటీల్లో, మల్టీ ప్లెక్సుల్లో, యూఎస్ఏలో సినిమా చాలా బావుంటుంది. బి సెంటర్లు, సి సెంటర్ల వారికి అంతగా నచ్చక పోవచ్చు అని చెప్పాను. సినిమా హిట్ కావాలంటే సినిమా బావుంటే చాలు, ఈ సిటీల్లో కంటే కూడా మీరు ఎక్కువ ఆదరిస్తారు అని ఈ రోజు మీరందరూ ప్రూవ్ చేశారు అని నాని అన్నారు.

    మాస్ మాస్ అని చెప్పి మిమ్మల్ని తక్కువ అంచనా వేస్తూ, మాకు మేమే డిసైడ్ అయిపోయి, మంచి సినిమాలు మీరు చూడరని అనుకున్నందుకు ఇండస్ట్రీ తరుపు నుండి, మా సినిమా టీం తరుపునుండి క్షమించమని మీ అందరినీ కోరుతున్నాను... అని నాని వ్యాఖ్యానించారు.

    కలెక్షన్ల పరంగా స్ట్రాంగ్

    కలెక్షన్ల పరంగా స్ట్రాంగ్

    మరో వైపు నిన్నుకోరి మూవీ బాక్సాఫీసు వద్ద స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ కనబరుస్తోంది. విడుదలైన అన్ని చోట్ల మంచి వసూళ్లు సాధిస్తోంది. ఆదివారం వరకు ఈచిత్రం వసూళ్లు ఏపీ, తెలంగాణలో దాదాపు రూ. 20 కోట్ల గ్రాస్ సాధించినట్లు తెలుస్తోంది.

    యూఎస్ఏలో

    యూఎస్ఏలో

    యూఎస్ఏలో శనివారం వరకు అందిన రిపోర్ట్ ప్రకారం.... రూ. 4.24 కోట్లు వసూలు చేసినట్లు ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ తెలిపారు.

    నిర్మాతలు కూడా ఊహించలేదు

    నిర్మాతలు కూడా ఊహించలేదు

    ఈ సినిమా కేవలం ‘ఎ' సెంటర్లు, మల్టీప్లెక్స్ ఆడియన్స్‌ను మాత్రమే మెప్పిస్తుందని నిర్మాతలు అంచనా వేశారు. అయితే వారు ఊహించని విధంగా బి, సి సెంటర్లలో కూడా మాస్ ప్రేక్షకుల నుండి సినిమాకు భారీ రెస్పాన్స్ రావడంతో అంతా ఆశ్చర్య పోయారు.

    నిన్ను కోరి

    నిన్ను కోరి

    నాని, నివేదా థామస్ హీరో హీరోయిన్లుగా నటించి ఈచిత్రంలో ఆది పినిశెట్టి, మురళీశర్మ, తనికెళ్ళ భరణి, పృథ్వీ, రాజశ్రీనాయర్‌, నీతు, భూపాల్‌రాజ్‌, కేదార్‌శంకర్‌, పద్మజ, ప్రియాంక నాయుడు, మాస్టర్‌ నేహంత్‌ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే, మాటలు: కోన వెంకట్‌, సంగీతం: గోపీసుందర్‌, ఫోటోగ్రఫీ: కార్తీక్‌ ఘట్టమనేని, ఆర్ట్‌: చిన్నా, స్టైలింగ్‌: నీరజ కోన, పాటలు: రామజోగయ్యశాస్త్రి, శ్రీజో, కో-డైరెక్టర్‌: లక్ష్మణ్‌ ముసులూరి, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: సత్యం గుగ్గిల, నిర్మాత: దానయ్య డి.వి.వి., కథ, దర్శకత్వం: శివ నిర్వాణ.

    English summary
    Nani apologies to Mass audience Archives. Nani stated that Ninnu Kori proved that audience will watch any good movie irrespective of classes.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X