twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘బ్యాండ్ బాజా బారత్’తెలుగు రీమేక్ ఖరారు..డిటేల్స్

    By Srikanya
    |

    హైదరాబాద్ :రణవీర్‌సింగ్, అనుష్కశర్మ హీరో,హీరోయిన్స్ గా నటించిన చిత్రం 'బ్యాండ్ బాజా బారత్'.యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ హిందీ ప్రేక్షకుల్ని మెప్పించి సూపర్ హిట్ గా నిలించింది. ప్రస్తుతం ఈ చిత్రం తెలుగులో రీమేక్ అవటానికి రెడీ అయ్యింది.'పంజా' చిత్రానికి దర్శకత్వం వహించిన విష్ణువర్థన్ శిష్యుడు గోకుల్ ఈ ప్రాజెక్టు ని డైరక్ట్ చేయబోయబోతున్నారు.

    తెలుగు, తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా తెరకెక్కబోయే ఈ చిత్రంలో హీరోయిన్ గా పరిణితిచోప్రా పేరును పరిశీలిస్తున్నారు. తెలుగు వెర్షన్ కి గానూ ఏ టైటిల్ నీ ఫిక్స్ చేయలేదు.యష్ రాజ్ ఫిల్మ్స్ వారే ఈ చిత్రాన్ని నిర్మిచనున్నారు. ఇంతకుముందు ఓ తమిళ నిర్మాణ సంస్ధ నిర్మిస్తారంటూ వార్తలు వచ్చాయి కానీ ఇప్పుడు యష్ రాజ్ వారే ఈ చిత్రంతో సౌత్ లోకి దిగుతున్నారు.

    ఇక నాని వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. 'ఈగ' చిత్రంతో కెరీర్‌లోనే పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్న ఆయన ప్రస్తుతం గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో 'ఎటో వెళ్లిపోయింది మనసు', కృష్ణవంశీ దర్శకత్వంలో 'పైసా' చిత్రాలతో పాటు సమువూదఖని దర్శకత్వంలో తమిళ, తెలుగు చిత్రం 'జెండాపై కపిరాజు'లో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం నాని హీరోగా తమిళ తెలుగు భాషల్లో ఎటో వెళ్లిపోయింది మనస్సు చిత్రం రూపొందుతోంది. నాని, సమంత జంటగా గౌతమ్‌ వాసుదేవమీనన్ దర్శకత్వంలో తేజ సినిమా ప్రొడక్షన్స్ పతాకంపై సి.కళ్యాణ్ నిర్మిస్తున్న చిత్రం 'ఎటో వెళ్లిపోయింది మనసు'.

    'ఎటో వెళ్లిపోయింది మనసు' సినిమాలో సమంత, నాని ఆరేళ్ల వయసులో కలుస్తారు. తర్వాత పదిహేనేళ్ల వయసులో కలుస్తారు. 20, 25ఏళ్ల వయసులోనూ కలుస్తారు. ఇలా ప్రతి ఏజ్‌లోనూ వాళ్ళలో వచ్చిన మార్పులు, భావోద్వేగాలు, అనుభూతులే ఈ సినిమా. నాని,సమంతలు సైతం ఈ చిత్రంపై మంచి హోప్స్ పెట్టుకున్నారు. సమంత ఈ చిత్రంలో తనకు డిఫెరెంట్ పాత్ర అని...టీనేజ్ అమ్మాయిగా,పెళ్లైన యువతిగా డిఫెరెంట్ గా ఒకే పాత్రలో కనిపిస్తున్నాని చెప్తోంది. ఈ చిత్రంపై నాని చాలా హోప్స్ పెట్టుకున్నారు.

    English summary
    Nani has bagged yet another big project and this time it’s Yash Raj Film’s first project in South. Earlier this year, Yash Raj Films had announced that it’s going to remake Band Baaja Baaraat in Telugu and Tamil. Several names including Nani’s were doing rounds to play the lead role in the film before Nani was finalized.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X