వెరైటీ డ్రెస్‌తో హీరో నాని బర్త్ డే (ఫోటోలు)
హైదరాబాద్ : తెలుగు హీరో నాని పుట్టిన రోజు వేడుక ఆదివారం హైదరబాద్ లోని రెయిన్ పబ్‌లో సింపుల్‌గా జరిగింది. అదే విధంగా నాని ప్రస్తుతం కృష్ణ వంశీ దర్శకత్వంలో నటిస్తున్న 'పైసా' మూవీ లోగో ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా నాని వేసుకున్న డ్రెస్ చర్చనీయాంశం అయింది.
నాని తన షర్టుకు ఒక పైసా, ఐదు పైసలు, పది పసలు, ఇరవై పైసలు, అర్ధరూపాయి, రూపాయి, ఐదు రూపాయలు, పది రూపాయల నాణేలను బటన్స్‌గా ఉపయోగించి వేసుకొచ్చాడు. ఈ డ్రెస్‌ను నాని కజిన్ ప్రశాంతి డిజైన్ చేసింది. 'పైసా' మూవీకి వెరైటీ ప్రచారం కల్పించడానికే తాను ఈ వెరైటీ డిజైన్ డ్రెస్ వేసుకొచ్చినట్లు నాని చెప్పుకొచ్చారు. నాని డ్రెస్ చూసి దర్శకుడు కృష్ణ వంశీతో పాటు చిత్ర యూనిట్ సభ్యులు, మీడియా వారు ఆశ్చర్యానికి గురయ్యారు.
సినిమా విషయానికొస్తే...
ఈ చిత్రంలో నాని సరసన కేథరిన్, లక్కీ శర్మ హీరోయిన్లుగా చేస్తున్నారు. ఎల్లోఫ్లవర్స్ పతాకంపై మిరపకాయ్ చిత్ర నిర్మాత రమేష్ పుప్పాల ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈచిత్రంలో నాని యంగ్ పొలిటీషియన్‌గా కనిపించబోతున్నాడు. దర్శకుడు కృష్ణ వంశీ పాటల చిత్రీకరణలో తన క్రియేటివిటీ చూపిస్తున్నారు. నిర్మాతలు కూడా ఆయన క్రియేటివిటీకి తగిన విధంగా భారీగా ఖర్చు పెడుతున్నారు. కేవలం పాటల చిత్రీకరణ కోసం దాదాపు కోటికిపైగా వెచ్చించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకుంది.
నాని కాస్ట్యూమ్స్ కోసం స్వారోవ్‌స్కి క్రిస్టల్స్ వాడుతున్నారట. ఓక్కో సూట్ కోసం దాదాపు 20 వేల క్రిస్టల్స్ వాడుతున్నారు. వీటితో తయారు చేసే ఒక్కో సూట్ కు రూ. 7.5 లక్షల వరకు ఖర్చవుతుందట. ఇప్పటి వరకు ఇండియాలో ఏ హీరో కూడా ఇలాంటి సూట్ తో పెర్ఫార్మ్ చేయలేదట. ఇంతకీ వీటికున్న ప్రత్యేకత ఏమిటంటే....మైఖేల్ జాక్సన్ ఇలాంటి క్రిస్టల్స్ తో చేసిన కాస్ట్యూమ్స్ వాడేవారని యూనిట్ సభ్యులు అంటున్నారు.

నాణేలతో కూడిన డ్రెస్ వేసుకుని కేక్ కట్ చేస్తున్న నాని, పక్రనే నాని భార్య అంజన

మీడియాకు తన డ్రెస్ గురించి చెబుతున్న నాని

పైసా చిత్ర యూనిట్ సభ్యుల మధ్య కేక్ కట్ చేస్తున్న నాని

నానికి పుష్పగుచ్చం, గిఫ్టు అందజేస్తున్న కృష్ణ వంశీ

నానితో కలిసి ఆ చిత్ర నిర్మాత రమేష్ పుప్పాల, దర్శకుడు కృష్ణ వంశీ, హీరోయిన్ లక్కీ శర్మ


Click it and Unblock the Notifications











