డౌరీ... వార్తలపై హీరో నాని ఫైర్!
హైదరాబాద్: హీరో నాని తన స్నేహితురాలు అంజనతో ఎంగేజ్మెంట్ జరుపుకున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 12న వైజాగ్‌లో చాలా సింపుల్‍గా ఎలాంటి ఆడంబరాలు లేకుండా కేవలం ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో హడావుడి లేకుండా జరిగి పోయింది. అయితే పెళ్లి మాత్రం ఇలా సింపుల్‌గా కాకుండా ఆడంబరంగా చేసుకుంటాను అంటున్నాడు ఈ యువ హీరో.
కాగా...అతని మామగారు నానికి కట్నకానుకల కింద భారీగానే ముట్టజెప్పాడని జూబ్లీహిల్స్ ఏరియాలో ఖరీదైన బంగళా, కూతురు-అల్లుడు షికార్లు కొట్టడానికి ఖరీదైన కారు ఇచ్చాడట. ఈ నేపథ్యంలో నాని డౌరీ తీసుకున్నాడంటూ వెబ్‌లో వార్తలు గుప్పుమన్నాయి. అయితే తాను వరకట్నం తీసుకుంటున్నాననే వార్తలపై నాని మండిపడుతున్నాడట. తాను కట్నం తీసుకునే మనిషిని కాదని, మామాగారు ప్రేమతో ఇచ్చిన కానుకలే అని తన సన్నిహితుల వద్ద వాపోతున్నాడట.
నవంబర్లో గ్రాండ్‌గా నాని-అంజన పెళ్లి జరుగనుంది. త్వరలోనే పెళ్లి తేదీ అధికారికంగా ప్రకటించనున్నారు. కామన్ ఫ్రెండ్ ద్వారా 5సంవత్సరాల క్రితం వైజాగ్‍లో నాని-అంజనకు పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఏది ఏమైతేనేం నాని ఓ ఇంటివాడు కాబోతున్నాడు.
నాని ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా గడుపుతున్నాడు. సముద్రఖని దర్శకత్వంలో జెండాపై కపిరాజు, గౌతం మీనన్ దర్శకత్వంలో ఎటో వెళ్లి పోయింది మనసు, కృష్ణ వంశీ దర్శకత్వంలో మరో చిత్రం చేస్తున్నారు. సముద్రఖని దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం షూటింగ్ ప్రస్తుతం గోవాలో జరుగుతోంది.


Click it and Unblock the Notifications











