మళ్లీ నాని, కలర్స్ స్వాతీ కాంబినేషన్
నాని, కలర్స్ స్వాతీ కాంబినేషన్ లో రూపొందిన అష్టాచెమ్మ చిత్రం అప్పట్లో మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇంద్రగంటి మోహన్ కృష్ణ డైరక్ట్ చేసిన ఈ చిత్రం చిన్న చిత్రాల్లో మంచి వసూళ్లు సాధించిన చిత్రం. ఇక ఇప్పుడు అదే కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ అదే డైరక్టర్ మోహన్ కృష్ణ తన తదుపరి చిత్రానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రం షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఇక ఈ చిత్రం తోనే కలర్స్ స్వాతి, నాని పరిచయమయ్యి మంచి బ్రేక్ తెచ్చుకున్నారు. అలాగే ఇప్పుడు చేయబోయే చిత్రం కూడా మంచి కామిడీ ఎంటర్టైనర్ అని చెప్తున్నారు.
కొద్ది కాలం క్రితం సుశాంత్ తో కలర్స్ స్వాతి కాంబినేషన్ లో మోహన్ కృష్ణ ఓ చిత్రం ప్లాన్ చేసారు. కానీ అది ముందుకు వెళ్లలేదు. ఆయన చేసిన గోల్కొండ హైస్కూల్ చిత్రం కూడా పెద్గగా వర్కవుట్ కాలేదు. మరో ప్రక్క కలర్స్ స్వాతి కూడా గెస్ట్ పాత్రలు చేస్తూ కాలం గడుపుతోంది. ఈ నేపధ్యంలో ఆమెకీ ఈ చిత్రం కీలకం కానుంది. నాని మాత్రం రాజమౌళి, గౌతమ్ మీనన్ వంటి దర్శకుల చిత్రాలతో బిజీగా ఉన్నారు.


Click it and Unblock the Notifications











