కల్కి 2898 AD మూవీపై నాని కౌంటర్ వేశాడా? సరిపోదా శనివారంలో ఆ సీన్ గమనించారా?
ఈ ఏడాదిలో ఒక్క తెలుగు సినిమా నుంచే దాదాపు 100 కి పైగానే సినిమాలు వచ్చి ఉంటాయి. మనకి తెలిసి కొంచెం నోటెడ్ గా వచ్చినవే మినిమమ్ ఒక 20 నుంచి 30 అయినా ఉంటాయి. కానీ వాటిలో హిట్ పర్సెంటేజ్ ఎంతుంటుంది అంటే చాలా తక్కువే అని చెప్పాలి. ఒక సినిమాకి భీభత్సమైన టాక్ వస్తే తప్ప జనం ఎవరూ థియేటర్స్ లోకి రావడం లేదు.
కాగా ఇలా ఈ ఏడాదిలో ఇంతలా జనాన్ని థియేటర్స్ లోకి రప్పించిన సినిమాలు చూస్తే లాంగ్ రన్ లో జనవరిలో వచ్చిన సూపర్ హీరో చిత్రం "హను మాన్" ఉంటే మళ్ళీ అక్కడ నుంచి జూన్ వరకు మరో సినిమా రాలేదు. భారీ లాంగ్ రన్ ని అయితే జూన్ లో రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన "కల్కి 2898 ఎడి" నమోదు చేస్తే ఈ సినిమా తర్వాత మళ్ళీ మామూలే.

మధ్యలో వచ్చిన కొన్ని సినిమాలు డిజాస్టర్ లు అయితే అప్పుడు వచ్చింది నాచురల్ స్టార్ నాని నటించిన సినిమా "సరిపోదా శనివారం". మంచి టాక్ ని మొదటి షో నుంచే సొంతం చేసుకొని సాలిడ్ బుకింగ్స్ ని కనబరుస్తుంది. కాగా ఈ సరిపోదా శనివారం సినిమాకి ప్రభాస్ కల్కి సినిమాకి చిన్న లింక్ అయితే కనిపిస్తుంది అని చెప్పాలి.
ఈ రెండు సినిమాలని చూసిన న్యూట్రల్ ఆడియెన్స్ గమనించారో లేదో కానీ సరిపోదా శనివారం లో కల్కి సినిమాకి ఇంకా కొన్ని సెంటిమెంట్స్ కి సెటైర్ వేసినట్టుగా ఓ సీన్ ఉంటుంది. అది కూడా క్లైమాక్స్ లో ఉంటుంది. భూమి మీద పెరిగిపోతున్న చెడుని అరికట్టేందుకు భగవంతుడు ఏదొక అవతారంలో వస్తాడు అని అప్పుడు వరకు జనం ఎదురు చూస్తూ ఉంటారు అన్నట్టు మన చరిత్రలో ఉంది.
కాగా ఇదే కాన్సెప్ట్ లో కల్కి 2898 ఎడి చిత్రంలో భూమి మీద చెడు పెరిగిపోయి మానవులు నిస్సాహయతలో ఉన్నపుడు కల్కి అవతారం వస్తుంది అని ఉంటుంది ఇది అందరికీ తెలుసు. కానీ దీనికే సెటైర్ వేసినట్టుగా ఉంటుంది. సరిపోదా శనివారం సినిమాలో నాని హిందీలో ఒక డైలాగ్ మంత్రంలా చదువుతూ ఉంటాడు. దానిని క్లైమాక్స్ లో ఓ చిన్న పాపకి చెబుతారు.
పురాతన కాలంలో నరకాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. అతన్ని శ్రీకృష్ణుడు సత్యభామ వధించారు అని చెప్తాడు. అక్కడే అదంతా పాత కాలం ఇప్పుడు ఉన్న కొత్త కాలం ఈ కాలంలో మనం ఏ అవతారం కోసమో ఎవరో వస్తారు అని ఎదురు చూస్తూ భయపడకూడదు. మనిషికి మనిషే తోడుగా ఉండి చెడుని ఎదుర్కోవాలి అని సందేశం ఇస్తాడు.
మరి ఇది వింటే మంచి మెసేజ్ లానే అనిపిస్తుంది కానీ నైస్ గా కల్కి లాంటి సినిమాలకి సెటైర్ వేసినట్టే ఉందని చెప్పాలి. అయితే ఇలా మన తెలుగు సినిమాల్లో ఒక సినిమాకి ఇంకో సినిమాలో సెటైర్ లాంటివి వెయ్యడం కొత్తేమి కాదు. చాలా సినిమాల్లో ఇవి కనిపిస్తూ ఉంటాయి. ఇంకా ఎక్కువగా అయితే దర్శకుడు హరీష్ శంకర్ సినిమాల్లో కనిపిస్తూ ఉంటాయి. మరి కల్కి విషయంలో దీనిని ప్రభాస్ ఫ్యాన్స్ గ్రహిస్తే నాని, దర్శకుడు వివేక్ ఆత్రేయ విషయంలో ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.


Click it and Unblock the Notifications











