Dasara Censor Review: నాని దసరా ఎలా ఉండబోతోందంటే.. హిట్ అవ్వడానికి ఆ రెండు సీన్స్ చాలు
నేచురల్ స్టార్ నాని నటించిన దసరా సినిమా మార్చి 30వ తేదీన గ్రాండ్ ద విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వం వహించిన ఈ సినిమాను శ్రీనివాస్ చిట్టూరి భారీ బడ్జెట్తో నిర్మించారు. ఇక మొత్తానికి సినిమాకు సంబంధించిన అన్ని పనులు ఫినిష్ అయ్యాయి. రీసెంట్ గా సెన్సార్ వర్క్ కూడా ఫినిష్ అయింది. ఇక ఈ సినిమా సెన్సార్ రిపోర్ట్ ప్రకారం ఎలాంటి టాక్ అందుకుంది? సినిమాలో ఎలాంటి సన్నివేశాలు ఉండబోతున్నాయి అనే వివరాల్లోకి వెళితే..

బడ్జెట్ ఎంత?
నాని గతంలో ఎప్పుడు లేనివిధంగా చాలా డిఫరెంట్ లుక్ తో దసరా సినిమాలో కనిపిస్తున్నాడు. ఈ సినిమాను మొదట 50 కోట్ల బడ్జెట్లోపే తెరపైకి తీసుకురావాలని అనుకున్నారు. కానీ ఆ తర్వాత కంటెంట్ కోసం రాజీ పడకుండా నిర్మాతలు మరింత ఎక్కువగా ఖర్చు చేయాల్సి వచ్చింది. మొత్తంగా 65 కోట్ల వరకు ఈ సినిమా కోసం ఖర్చు చేసినట్లుగా ఒక టాక్ అయితే వినిపిస్తోంది.

మంచి డిమాండ్
సినిమాకు మార్కెట్లో డిమాండ్ అయితే మంచిగానే ఏర్పడినట్లు సమాచారం. తప్పకుండా వందకోట్ల మార్కెట్ ను అందుకుంటుంది అని కూడా నిర్మాతలు నమ్మకంతో ఉన్నారు. కేవలం తెలుగులోనే కాకుండా ఈ సినిమాకు తమిళ్ మలయాళం లో కూడా కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక కన్నడలో కూడా మంచి డిమాండ్ ఏర్పడినట్లు సమాచారం.

U/A సర్టిఫికెట్
అయితే ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ పనులు కూడా ఇటీవల ఫినిష్ అయ్యాయి. ఇక సెన్సార్ నుంచి ఈ సినిమాకు U/A సర్టిఫికెట్ దక్కినట్లు తెలుస్తోంది. సినిమాలో కొన్ని యాక్షన్ సన్నివేశాలు మరింత బోర్డ్ గా ఉండడంతో పాటు రక్తపాతం కూడా గట్టిగానే ఉండబోతున్నట్లు అర్థమవుతుంది. కాబట్టి సినిమాకు ఆ సర్టిఫికెట్ జారీ చేశారు.

రన్ టైమ్ ఎంతంటే..
ఇక ఈ సినిమాకు మొత్తంగా 2:50 నిమిషాల రన్ టైమ్ తో ఎడిట్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే సెన్సార్ యూనిట్ అభిప్రాయం ప్రకారం దాదాపు 8 నిమిషాల సీన్స్ తొలగించినట్లుగా తెలుస్తోంది. ఇక మొత్తంగా అయితే ఫైనల్ రన్ టైమ్ రెండు గంటల ముప్పై ఆరు నిమిషాలకు ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఎలాంటి లాగ్ లేకుండా సినిమా బోరింగ్ గా అనిపించకుండా ఫైనల్ కట్ రెడీ అయినట్లు సమాచారం.

ఇంటర్వెల్ బ్యాంగ్
ఇక ఈ సినిమాలో నాని ధరణి అనే ఒక క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు. అల్లరి చిల్లరిగా తిరిగే ధరణి ఆ తర్వాత ఒక సమస్య వలన తను ఉండే బస్తీ వాళ్ల కోసం ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? ఇక ఆ మైనింగ్ మాఫియాలో జరిగే కుంభకోణాలు ఏంటి.. దాని వెనక ఉండే రాజకీయాలు ఏంటి అనే అంశాలు కూడా ఈ సినిమాలో హైలెట్ కాబోతున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ అద్భుతంగా ఉంటుందని సమాచారం.

కీర్తి సురేష్ కూడా..
సినిమాలో నాని నటించే విధానం.. అలాగే క్లైమాక్స్ సన్నివేశం కూడా ఈ సినిమాలో చాలా హైలెట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక కీర్తి సురేష్ కూడా ఇంటర్వెల్ కి ముందు ఇంటర్వెల్ తర్వాత రెండు కీలకమైన సీన్స్ లో కూడా అద్భుతంగా నటిస్తుందట. ఈ సినిమాలో ఎమోషనల్ కంటెంట్ తో పాటు సీరియస్ డ్రామా కూడా ప్రేక్షకులను కదిలిస్తుంది అని తప్పకుండా అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా ఉంటుంది అని ఒక టాక్ అయితే వినిపిస్తోంది. మరి బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకు ఏ రేంజ్ లో కలెక్షన్స్ వస్తాయో చూడాలి.


Click it and Unblock the Notifications











