twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    స్టార్ హీరో అనిపించుకోవాలని లేదు

    By Srikanya
    |

    స్టార్‌ని అనిపించుకోవడం కంటే... ఆర్టిస్ట్ అనిపించుకోవడం నాకిష్టం అంటున్నారు నాని.అలా మొదలైంది చిత్రంతో ఒక్కసారిగా అందరి దృష్టిలో పడ్డ నాని తన తాజా చిత్రం 'సెగ"ప్రమోషన్ లో బాగంగా కలిసిన మీడియాతో ఇలా స్పందించారు.అలాగే దానికి కారణం చెప్తూ..రెగ్యులర్ సినిమాలు చేస్తూ పోతే ఆర్టిస్టుగా ఎదగలేం. తమిళంలో రెగ్యులర్ సినిమాలతో పాటు ప్యారలల్ సినిమాలు కూడా వస్తుంటాయి. అలాంటి సినిమాల్లో నటిస్తే నటుడిగా ఎదగగలం. అందుకే తమిళంలో 'సెగ" చేశాను. తప్పకుండా ఈ సినిమా నటుడిగా నన్ను మరో మెట్టు పైకి తీసుకెళుతుంది అన్నారు.

    ఇక 'సెగ"చిత్రం గురించి చెబుతూ..సెగ" ఒక కథ కాదు.. సంఘటన. ఆరు పాత్రల మధ్య సాగుతుంది. ఈ ఆరుగురు ఓ సందర్భంలో తీసుకున్న ఓ చిన్న నిర్ణయం వారి జీవితాల్లో ఊహించని మార్పు తెస్తుంది. 'అలామొదలైంది" పాత్రలకు విరుద్ధంగా ఇందులో పాత్రలు ఉంటాయి. రొటీన్ కథలతో సినిమాలు వస్తున్న నేటి కాలంలో ఓ కొత్త సినిమా చూసిన అనుభూతికి లోను చేసే సినిమా ఇది.అంజన ఈ చిత్రాన్ని చక్కగా తీసింది. ఆమె కథలను తెలుగు కథ, తమిళ కథ అని వ్యత్యాసంగా చూడలేం. ఇంటర్నేషనల్ సెన్సిబులిటీతో ఆమె కథలు ఉంటాయి. 'సెగ" అలాంటిదే అన్నారు.నాని, నిత్యామీనన్ జంటగా నటించిన 'సెగ" ఈ నెల 29న విడుదల కానుంది.

    English summary
    Nani and Nithya Menon starrer love entertainer 'Sega' is all set to release on July 29th. This lead pair acted in 'Ala Modalaindi' which became an instant hit in Telugu this year. 'Sega' is directed by Anjana Ali Khan.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X