twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాజమండ్రిలో నానికి వార్నింగ్.. క్వార్టర్ మందు పడితే గానీ పని జరగదు అంటూ నేచురల్ స్టార్!

    |

    నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్‌లో వస్తున్న టక్ జగదీష్ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక పరిచయ వేదిక పేరుతో రాజమండ్రిలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ భరత్, నరేష్ ఇతర సినిమా యూనిట్ సభ్యులు ఈ వేడుకలో పాలుపంచుకొన్నారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ..

    రాజమండ్రిలోనే వారం రోజులుగా

    రాజమండ్రిలోనే వారం రోజులుగా

    ఏడాది కాలంగా మీకు దూరమయ్యాను. ఇప్పుడు మాస్క్‌తోపాటు ఇతర కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ మీ ముందుకు వచ్చాం. రాజమండ్రిలో ఈ వేడుకను నిర్వహించాలని అనుకొన్నప్పుడు నేను వస్తున్నా అంటూ ఓ పోస్టు పెట్టాను. కానీ వారం రోజులుగా నేను రాజమండ్రిలో శ్యామ్ సింగరాయ్ సినిమా షూటింగులో ఇక్కడే ఉన్నాను అని నాని తెలిపారు.

    నాతో ఫోటో దిగకపోతే అంటూ అభిమాని

    నాతో ఫోటో దిగకపోతే అంటూ అభిమాని

    రాజమండ్రిలో శ్యామ్ సింగరాయ్ సినిమా చేస్తున్నప్పుడు స్థానికులను బౌనర్లు అడ్డుకొన్నారు. అయితే అలాంటి సమయంలో నేను అలా నడుచుకొంటూ వెళ్తుంటే గుంపులో నుంచి ఓ అభిమాని గట్టిగా అరుస్తూ.. నాతో ఫోటో దిగకపోతే నేను మీ షూటింగు చేసుకోనివ్వను అని అన్నాడు. ప్రపంచంలో అలాంటి వార్నింగ్‌ను మర్యాదగా ఇచ్చేది కేవలం రాజమండ్రి వారే అని నాని అన్నారు.

     టక్ జగదీష్ ఫ్యామిలీ పరిచయం

    టక్ జగదీష్ ఫ్యామిలీ పరిచయం

    రాజమండ్రిలో ఈ వేడుకను పరిచయ వేదిక పేరుతో నిర్వహించాలని అనుకొన్నాం. అయితే ఈ సినిమా ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కూడుకొన్నది. మా సినిమా ఫ్యామిలీని రాజమండ్రిలోని ఫ్యామిలీలకు ఇంట్రడ్యూస్ చేయాలని నిర్ణయించాం అని అన్నారు. ఆ తర్వాత సినిమా యూనిట్‌ సభ్యులను నాని పేరు పేరునా పరిచయం చేశారు.

    చిన్నబావకు క్వార్టర్ పడితే తప్పా...

    చిన్నబావకు క్వార్టర్ పడితే తప్పా...

    తొలుత మా నాన్న ఆదిశేషు నాయుడు. ఊరి పెద్దగా వ్యవహరిస్తాడు. ఆయన చెప్పిందే వేదం. మా అన్నయ్య బోస్ అంటూ జగపతిబాబును పరిచయం చేశాడు. అంతా బాగుండాలని కోరుకోనే వాడు. దేవుడు బావ అంటూ రావు రమేష్‌ను పరిచయం చేస్తూ.. ఊరిలో అందరికి మంచి జరిగితే తనకు మంచి జరిగినట్టు ఫీలవుతాడు. అంతేకాకుండా మా సత్తిబాబు చిన్న బావ అంటూ నరేష్‌ను ఇంట్రడ్యూస్ చేశారు. ఆయన తెల్లారితే చాలూ క్వార్టర్ పడితే తప్పితే పని జరగదు అంటూ నాని పరిచయం చేస్తూ వెళ్లారు.

    రాజమండ్రిలో ఓ అమ్మ దీవెనలు

    రాజమండ్రిలో ఓ అమ్మ దీవెనలు

    పరిచయ వేదిక అనంతరం నాని మాట్లాడుతూ... నేను ఏ పని చేసినా మా అమ్మ ఆశీర్వాదం తీసుకొంటాను. ఈ సినిమా ప్రమోషన్‌ను రాజమండ్రిలో ప్రారంభించాను కాబట్టి ఇక్కడి ఒక అమ్మ దీవెనలు తీసుకొని ప్రమోషన్స్‌తో ముందుకెళ్తాను అని నాని అన్నారు. అలాగే జనంలోకి వెళ్లి ఓ అమ్మ దీవెనలు తీసుకొని బొట్టు పెట్టుకొన్ని వచ్చాడు.

    English summary
    Nani's Tuck Jagadish Parichaya Veduka organised in Rajamahendravaram. MP Bharat attend for this Event. Nani made emotional speech about his movie team. He speech was so sensible.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X