నాని ఎమోషనల్ ట్వీట్.. మిమ్మల్ని ప్రేమించేది రిజల్ట్స్ కోసమా!
నేచురల్ స్టార్ నాని ఇటీవల జెర్సీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. జెర్సీ చిత్రం పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. జెర్సీ చిత్రంలో నాని కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ పెర్ఫామెన్స్ అందించాడని సర్వత్రా ప్రశంసలు వ్యక్తం అవుతున్నాయి. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నాని క్రికెటర్ పాత్రలో నటించాడు. శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం తెలంగాణాలో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు ప్రకంపనలు రేపుతున్నాయి.
టాలీవుడ్ సెలెబ్రిటీలు చాలా మంది ఈ విషయం గురించి స్పందించారు. తాజాగా నాని కూడా విద్యార్థుల ఆత్మహత్యలపై ట్విట్టర్ లో ఎమోషనల్ గా స్పందించాడు. ' విద్య అంటే నిరంతరం నేర్చుకుంటూ ఉండడం.. అంతే కానీ మార్క్ షీట్స్ లో వచ్చే నంబర్ కాదు. మీకు రావాల్సింది దక్కకపోతే పోరాటం చేయండి. సాధించే వరకు పోరాడండి. పరీక్షలు, ఫలితాలు వీటన్నింటికి మించినది జీవితం. ఒక్కసారి మీ తల్లిదండ్రుల గురించి ఆలోచించండి. ఇంటర్ రిజల్ట్స్ కోసం వారు మిమ్మల్ని ప్రేమించరు. ఏమీ ఆశించకుండా ప్రేమిస్తారు అని నాని విద్యార్థులకు సూచించాడు.

డైరెక్టర్ మారుతి, కోనవెంకట్, హీరో రామ్, సాయిధరమ్ తేజ్, సంపూర్ణేష్ బాబు లాంటి సినీ సెలెబ్రిటీలు విద్యార్థుల ఆత్మహత్యలపై ఇప్పటికే స్పందించారు. ఇదిలా ఉండగా నాని జెర్సీ తర్వాత నటిస్తున్న చిత్రం గ్యాంగ్ లీడర్. మనం ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.


Click it and Unblock the Notifications











