లేడీ డైరెక్టర్లతో ఎంజాయ్ చేస్తున్న నాని
అంజనా అలీఖాన్ గుర్తుందా? అదేనండీ తమిళ 'వెప్పం" సినిమాకు దర్శకత్వం వహించింది. అదే సినిమా తెలుగులో 'సెగ" పేరుతో విడుదలైంది. ప్రస్తుతం ఈ దర్శకులురాలు హైదరాబాద్ లో ఉంది. ఇప్పడు ఈవిడ గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే....ఈ సినిమాలో హీరోగా నటించిన నాని 'వెప్పం" సినిమా స్క్రిప్టు తయారీలో ఆమెకు చాలా సాయం చేశాడు. ప్రస్తుతం హైదరాబాద్ వచ్చిన ఆమెను చాలా బాగా చూసుకుంటున్నాడు నాని. మరో లేడీ డైరెక్టర్ నందినిరెడ్డి(అలా మొదలైంది) నానికి చాలా క్లోజ్ ఇప్పడు ఈ ముగ్గురు కలిసి నగరంలో విహరిస్తున్నారు.
ఈ ముగ్గురిని చూసిన పిల్మ్ నగర్ జనాలు రకరకాలు గా చర్చించుకుంటున్నారు. నాని ఇద్దరు లేడీ డైరెక్టర్లతో ఎంజాయ్ చేస్తున్నాడు అతనెంతో లక్కీ అంటూ గుసగుసలాడుకంటున్నారు. ఎంజాయ్ అంటే పెడార్థాలు తీయకండి. ఇద్దరు లేడీ డైరెక్టర్లతో పాటు, నానికి కూడా దర్శకత్వ శాఖలో అనుభవం ఉంది. ముగ్గురు కలిసి మంచి మంచి స్టోరీ తయారు చేస్తూ, కథా చర్చలతో ఎంజాయ్ చేస్తున్నారని దానర్థం.


Click it and Unblock the Notifications











