twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ నిజాన్ని మరిచిపోయాడట.. ఆయనకు బహిరంగ క్షమాపణ.. దటీజ్ నాని

    |

    నితిన్ చెక్ సినిమా కోసం టాలీవుడ్ స్టార్స్ కదిలివచ్చారు. ఎన్టీఆర్ దగ్గరి నుంచి చాలా మంది హీరోలు చెక్ సినిమాను ప్రమోట్ చేశారు. కొందరు నితిన్ కోసం అయితే.. ఇంకొందరు డైరెక్టర్ చంద్ర శేఖర్ యేలేటి గురించి ప్రమోషన్స్‌లోకి వచ్చారు. అలా అందరూ కలిసి కాస్త గట్టిగానే ప్రమోట్ చేశారు. దానికి తగ్గట్టే సినిమా ఫలితం కూడా బాగానే వచ్చింది. చెక్ చిత్రం బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయినట్టు కనిపిస్తోంది. రివ్యూలు, పబ్లిక్ టాక్ అంతా కూడా పాజిటివ్ ఉండటంతో కలెక్షన్లు బాగానే వచ్చేలా ఉన్నాయి.

    అలా ప్రమోషన్స్..

    అలా ప్రమోషన్స్..

    నితిన్ చెక్ కోసం రంగ్ దే టీం రంగంలోకి దిగింది. కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, వెంకీ అట్లూరి ఇలా అందరూ కలిసి స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు. ఇక ఎన్టీఆర్ అయితే చంద్రశేఖర్ యేలేటి తనకు ఇష్టమైన దర్శకుల్లో ఒకరు అని చెబుతూ చెక్ సినిమా సక్సెస్ కావాలని కోరాడు.

    నాని అలా..

    నాని అలా..

    నాని కూడా ఇదే క్రమంలో చెక్ మూవీపై ఓ ట్వీట్ వేశాడు. నాకు ఇష్టమైన దర్శకుల్లో ఒకరైన చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో రాబోతోన్న చెక్ సినిమా రిలీజ్ కాబోతోంది. నా స్నేహితులు నితిన్, రకుల్ ప్రీత్ అందులో నటిస్తున్నారు. వారందరికీ అది బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించాలని కోరుకున్నాడు.

    మరిచిపోయిన నాని..

    మరిచిపోయిన నాని..

    అయితే నాని చేసిన పని అక్కడి వరకు బాగానే ఉంది. కానీ అసలు వ్యక్తిని మరిచిపోయాడ. చెక్ మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణి మాలిక్‌ గురించి చెప్పడం మరిచిపోయాడు. ఆయన గురించి నాని ఎందుకు చెప్పాలో అందరికీ తెలిసిందే. నానికి కెరీర్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన సినిమాలకు కళ్యాణి మాలిక్ మ్యూజిక్ డైరెక్టర్.

    థ్యాంక్స్ చెప్పిన కళ్యాణి మాలిక్..

    థ్యాంక్స్ చెప్పిన కళ్యాణి మాలిక్..

    నాని చేసిన ట్వీట్‌లో తన పేరు లేకపోయినా తన గురించి ప్రస్థావించకపోయినా కూడా కళ్యాణి మాలిక్ మాత్రం థ్యాంక్ యూ సో మచ్ డియర్ నాని అంటూ ట్వీట్ వేశాడు. అది చూసిన నాని వెంటనే తన తప్పును సరి చేసుకుని బహిరంగంగానే క్షమాపణలు చెప్పేశాడు.

    దటీజ్ నాని

    దటీజ్ నాని

    సర్ క్షమించండి.. నాకెంతో ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్.. పైగా నా మొదటి సినిమా (అష్టాచమ్మా) మ్యూజిక్ డైరెక్టర్ కూడా మీరే.. నేను ఆ నిజాన్ని మరిచిపోయాను.. మీకు మళ్లీ ఓ హిట్ రావాలి.. బెస్ట్ విషెస్ అంటూ తన తప్పును సరిదిద్దుకున్నాడు. ఈ ట్వీట్‌పై నాని అభిమానులు, నెటిజన్లు చూసి దటీజ్ నాని అంటూ సారీ చెప్పేశాడంటూ ఎంతో గొప్పొడు అంటూ పొగిడేస్తున్నారు.

    English summary
    Nani Forgot about Kalyani malik On Check Team Tweet..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X