ఓ వైపు దేవదాస్, మరో వైపు బిగ్‌బాస్... ఒత్తిడికి గురవుతున్న నాని, కాశీ ప్రయాణం!

ఈ వారం నాని చాలా స్ట్రెస్ ఫీలవుతున్నాడట. అందుకు కారణం ఓ వైపు నాగార్జునతో కలిసి తాను నటించిన 'దేవ దాస్' సినిమా విడుదల ఉండటం, ఇదే వారాంతం తాను హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ తెలుగు 2 షో గ్రాండ్ ఫినాలె ఉండటంతో.....చాలా ఒత్తిడికి గురవుతున్నారు. నాకు మోస్ట్ స్ట్రెస్‌ఫుల్ వీక్ అంటే ఇదే. అదే సమయంలో మోస్ట్ ఎక్జైటింగ్, మోస్ట్ నర్వస్, ప్లస్, మైనస్‌లు కలిసి ఉన్న వారం ఇది. ఇంత ఒత్తిడి తాను గతంలో ఎప్పుడూ ఫీల్ కాలేదు అని నాని మంగళవారం జరిగిన 'దేవదాస్' ప్రెస్‌మీట్‌లో వ్యాఖ్యానించారు.

vote for your favourite bigg boss contestant here

బిగ్‌బాస్ ముగిసిన తర్వాత కాశీకి వెళిపోతా

బిగ్‌బాస్ ముగిసిన తర్వాత కాశీకి వెళిపోతా

‘దేవదాస్' విడుదలైన తర్వాతి రోజే బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలె మొదలవుతుంది. ఈ ఒత్తిడి నుంచి బయట పడాలంటే ఎటైనా వెళ్లిపోవాల్సిందే. అందుకే బిగ్ బాస్ పూర్తయిన వెంటనే కాశీకి కానీ, మరెక్కడికైనా వెళ్లాలని అనుకుంటున్నాను అని నాని వ్యాఖ్యానించారు.

ఆయనతో నటించడమే నా అదృష్టం

ఆయనతో నటించడమే నా అదృష్టం

నాగార్జున గారితో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం రావడమే నా అదృష్టంగా భావిస్తున్నాను. నాగార్జున గారికి నేను పెద్ద అభిమానిని, ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. నాగ్ సర్ నా సినిమాలు క్యూబ్‌లో చాలా కంఫర్టబుల్‌గా చూసుంటారు. నేను బయట థియేటర్ల వద్ద టిక్కెట్ల కోసం కొట్టుకుని మరీ ఆయన సినిమాలు చూశాను. నా అభిమాన హీరోతో కలిసి చేయడం అనేది ఒక వండర్ ఫుల్ ఎక్స్ పీరియన్స్... అని నాని అన్నారు.

ఆయన మాటల ఎప్పటికీ మరిచిపోలేను

ఆయన మాటల ఎప్పటికీ మరిచిపోలేను

నాగ్ సర్ ఏ విషయమై అయినా చాలా ఓపెన్‌గా చెప్పేస్తారు. ‘దేవదాస్' సినిమా పూర్తయిన వెంటనే ఆయన సినిమా గురించి, నా నటన గురించి చెప్పిన మాటలు ఎప్పటికీ మరిచిపోలేను.... అని నాని ఈ సందర్భంగా మీడియా వారు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

Recommended Video

Devadas Movie Pre Release Business
దేవదాస్

దేవదాస్

నాగార్జున అక్కినేని, నాని, ర‌ష్మిక మంద‌న్న‌, ఆకాంక్ష సింగ్, న‌రేష్ వికే, బాహుబ‌లి ప్ర‌భాక‌ర్, రావు ర‌మేష్, వెన్నెల కిషోర్, అవ‌స‌రాల శ్రీ‌నివాస్ నటించిన చిత్రం ‘దేవదాస్'. శ్రీ‌రామ్ ఆదిత్య‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్, వ‌యాక‌మ్ 18 మీడియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై అశ్వినీదత్ నిర్మించారు. సెప్టెంబర్ 27న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X