ఫేస్ బుక్ అమ్మాయితోనే.. హీరో నాని ఎంగేజ్ మెంట్!?
నాని, ఆమలాపాల్ జంటగా వాసన్స్ విజువల్స్ వెంచర్స్ పతాకంపై రూపొందిస్తున్న 'జెండాపై కపిరాజు'. ఆ మధ్యన హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. పి.సముద్రఖని (శంభో శివ శంభో ఫేం) దర్శకత్వంలో కె.శ్రీనివాసన్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. చిత్ర దర్శకుడు సముద్రఖని మాట్లాడుతూ ప్రతిరోజూ మన సమాజంలో ఎదురయ్యే అనేక సమస్యల గురించి ఈ చిత్రం చర్చిస్తుందని, ప్రజలు తమ పని తాము కచ్చితంగా చేస్తే ప్రపంచమంతా చక్కగా సాగుతుందన్న అంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం అన్నారు.
ఇక సందేశాత్మకంగా సాగే ఈ చిత్రం లోని పాటలను మొదటగా గోవాలో చిత్రీకరిస్తామని, సెప్టెంబర్, అక్టోబర్‌లలో హైదరాబాద్, వైజాగ్‌ల్లో షెడ్యూల్స్ జరుగుతాయని నిర్మాత తెలిపారు. ఆమలాపాల్, శశాంక్ వెన్నెలకంటి, జి.వి.ప్రకాష్‌కుమార్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: జి.వి.ప్రకాష్‌కుమార్, మాటలు: శశాంక్ వెనె్నలకంటి, కెమెరా: ఎన్.సుకుమార్, పాటలు: అనంత్‌శ్రీరామ్, ఎడిటింగ్: ఎస్.ఎన్.్ఫజిల్, నిర్మాత: కె.శ్రీనివాసన్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పి.సముద్రఖని.


Click it and Unblock the Notifications












