నేడు హీరో నాని వివాహం
హైదరాబాద్: సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ భీమిలి కబడ్డీ జట్టు, పిల్ల జమిందార్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో నాని నేడు(అక్టోబర్ 27) ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. తన ప్రియురాలు అంజనతో నాని వివాహం విశాఖలో జరుగనుంది. ఆగస్టు 12న వీరి ఎంగేజ్ మెంట్ జరిగిన విషయం తెలిసిందే. ఎంగేజ్ మెంట్ సింపుల్ గా జరుపుకున్న నాని....వివాహం కూడా నిరాడంబరంగా కొద్ది మంది స్నేహితులు, సన్నిహితులు, బంధువుల మధ్యనే జరుపుకోవాలని నిర్ణయించుకున్నాడు. రేపు మ్యారేజ్ ఫోటోస్ బయటకు విడుదల చేయనున్నారు.

నాని ప్రస్తుతం గౌతం మీనన్ దర్శకత్వంలో 'ఎటో వెళ్లి పోయింది మనసు' చిత్రంతో, కృష్ణ వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న ఓ చిత్రంలో నటిస్తున్నాడు. సముద్ర ఖని దర్శకత్వంలో నాని నటిస్తున్న చిత్రానికి 'జెండాపై కపిరాజు' అనే టైటిల్ ఖరారు చేశారు. రాజమౌళి దర్శకత్వంలో నాని నటించిన 'ఈగ' చిత్రం ఇటీవల విడుదలై భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











