కృష్ణార్జున యుద్ధం బ్యూటీ..మెగా హీరోని ఆదుకోవడానికి వస్తోంది !
మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కెరీర్ ప్రస్తుతం సందిగ్ధంలో ఉంది. తేజు గత ఐదు చిత్రాలన్నీ డిజాస్టర్ లుగా మారాయి. ఇటీవల తేజు నటించిన ఇంటెలిజెంట్ చిత్రం దారుణ పరాభవానికి గురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సాయి ధరమ్ తేజ్ ఆచి తూచి అడుగులు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం కరుణాకరన్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. తేజు తదుపరి చిత్రం గురించి ఆసక్తికరమైన వార్తలు వస్తున్నాయి. కృష్ణార్జున యుద్ధం చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న రుక్సార్ మీర్ తేజు హీరోయిన్ గా ఎంపికైందనేది లేటెస్ట్ న్యూస్.

ఆకతాయితో రొమాన్స్
రుక్సార్ మీర్ ఆకతాయి చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం పెద్దగా గుర్తింపు పొందకపోవడంతో రుక్సార్ టాలీవుడ్ కు పెద్దగా తెలియలేదు.

లక్కీ ఛాన్స్
వరుస విజయాలతో దూసుకుపోతున్న నాని సరసన రొమాన్స్ పండించే లక్కీ ఆఫర్ ని రుక్సార్ కొట్టేసింది. కృష్ణార్జున యుద్ధం చిత్రంలో రుక్సార్ హీరోయిన్. ఈ చిత్రం విజయం సాధిస్తే రుక్సార్ ఇక వెనుదిరిగి చూసే అవసరం ఉండదు.

మరో అవకాశం
రుక్సార్ మీర్ మరో అవకాశాన్ని అందుకున్నట్లు తెలుస్తోంది. మెగా హీరో సాయిధరమ్ తేజ్ సరసన రుక్సార్ నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో తేజు నటించనున్నాడు. ఈ చిత్రంలో రుక్సార్ హీరోయిన్ గా ఎంపికైనట్లు తెలుస్తోంది.

తేజుకి బ్రేక్ ఇస్తుందా
తేజు ప్రస్తుతం వరుస ప్లాపుల్లో ఉన్నాడు. ఈ భామ అయినా తేజకు కలసి వస్తోందో లేదో చూడాలి.
సోషల్ మీడియాలో ఒంపు సొంపుల హొయలు
రుక్సార్ మీర్ సోషల్ మీడియా లో కూడా బాగా యాక్టివ్. ఈ అమ్మడు తన పరువాల హొయలు వెదజల్లుతూ ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతోంది.


Click it and Unblock the Notifications











