మీరు ఏ పిల్లాడి గురించి మాట్లాడుతున్నారు సర్.. నాని ట్వీట్ వైరల్
మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో ఎంతగా హల్చల్ చేస్తున్నాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఉగాది రోజున సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన చిరు.. నాటి నుంని ట్వీట్లతో దుమ్ములేపుతున్నాడు. వారు వీరు అని తేడా లేకుండా అందరికీ తనదైన శైలిలో పంచ్‌లు వేస్తున్నాడు. చిరు కౌంటర్లకు ఇప్పటికే మోహన్ బాబు, పూరి జగన్నాద్, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, దర్శకధీరుడు రాజమౌళి ఖంగుతిన్నారు.
మెగాస్టార్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానుల మనసులను గెలుచుకుంటున్నాడు. తాజాగా షేర్ చేసిన ఓ వీడియోలో చిరు చిన్న పిల్లాడిలా మారిపోయాడు. తన మనవరాలితో కలిసి అల్లరి చేశాడు. చిన్నారిని ఆట పట్టిస్తూ ఏడిపించాడు. ఆ సమయంలో చిరు కూడా చిన్న పిల్లాడిలా ఆశ్చర్యపోవడం, నవ్వడం, స్టెప్పులు వేయడం తెగ వైరల్ అవుతోంది.

తన మనవరాలికి మీ మీ.. (ఖైదీ నంబర్ 150) అనే పాట ఇష్టమని చెప్పుకొచ్చాడు. దానికి తగ్గట్టే ఆ చిన్నారి అదే పాట పెట్టమని మారాం చేసింది. మధ్యలో పాటను ఆపి.. చిన్నారికి కోపం తెప్పించేలా చేసిన చిరు.. మళ్లీ పాటను ప్లే చేసి నవ్వించాడు. ఈ మేరకు షేర్ చేసిన వీడియోపై నాని కామెంట్స్ చేశాడు. ఆ వీడియోలో తాను ఇద్దరు పిల్లల్ని (చిరునుద్దేశిస్తూ) చూశాను.. అందులో మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు సర్ అంటూ.. ట్విట్టర్‌కు స్వాగతమని పేర్కొన్నాడు.


Click it and Unblock the Notifications











