'ఈగ'లో నేను కాదు హీరో: నాని
'ఈగ' సినిమాలో హీరో 'ఈగ' అంటే నా పాత్ర చచ్చిపోయి ఈగ అవుతుంది కదా. అలా చూసుకుంటే ఈగ ఉన్నంతసేపూ నేను కనబడను. కనుక ఈగ సినిమాలో హీరో ఈగే. ఈగ సినిమాలో నేను నటించనంత మాత్రాన ఆ సినిమాకు నేనే హీరోనని కాలర్ ఎగురేయలేను. అన్నారు హీరో నాని. అలాగే 'ఈగ' అనేది టెక్నికల్ సినిమా. దాంట్లో ఉన్న నా క్యారెక్టర్ని మీరూ,నేనూ కూడా పోషించగలం. ఎందుకో దర్శకుడు నన్ను అభిమానించాడు కనుక నాకు ఆ పాత్ర వచ్చింది. నేను రాజమౌళిగారి డైరెక్షన్‌లో చెయ్యడం అదృష్టం' అని చెప్పుకొచ్చారు.
'అలాగని నేనేమీ పెద్ద కమర్షియల్ హీరోని కాదు. సమంతతో నటించడం, ఒకటి రెండు పాటలకు ఆమెతో పనిచేయడంలాంటివన్నీ పేరుకే మాత్రం. ఇంకా హీరోగా నిలబడాలంటే ఇంకొన్ని చిన్న సినిమాలు చేయాల్సి ఉంటుంది. అలాంటి సినిమాల్లో నా సత్తా ఏపాటిదో నిరూపించుకోవాల్సి వుంటుంది. అంతదాకా నేను కృషి చేయాలి. అప్పుడే హీరోగా పేరు తెచ్చుకుంటాను' అన్నారు.
'ఇక ఈగ సినిమాలో నాతోపాటు చేసిన సుదీప్‌గారికి ప్రధాన పాత్ర ఉంది. ఇంగ్లీష్ సినిమాలో హీరో పాత్రకు ఎక్కువ నిడివి ఉండదు. ఒక్కోసారి విలన్ పాత్రే సినిమాలో డామినేట్ చేస్తూ ఉంటుంది. ఇలాంటి న్యూవేలో సినిమాలు తీస్తున్న రాజమౌళిగారు తెలుగు సినిమాలకు వరంలాంటివాడు. ఆయన తెలుగు సినిమాను హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లడం మనందరం గర్వించదగ్గ విషయం...' అని అంటున్నాడు.
ప్రస్తుతం నాని..కృష్ణవంశీ దర్శకత్వంలో పైసా అనే చిత్రం చేస్తున్నారు. ఆ చిత్రం కూడా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నాడు. తమిళ దర్శకుడు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఎటో వెళ్లిపోయింది మనసు' చిత్రంలో చేస్తున్నారు. ఆ చిత్రంలో నానితో సమంతతో మరోసారి నటించడం నుంది. అలాగే నాని మరో చిత్రం కమిటయ్యారు. శంభో శివ శంబో,సంఘర్షణ చిత్రాలు డైరక్ట్ చేసిన సముద్రఖని నాని తన బైలింగ్వల్ చిత్రంలోకి తీసుకున్నారు.
ఆగస్టు నుంచి ఈ చిత్రం ప్రారంభం కానుంది. ఈ విషయమై నాని మాట్లాడుతూ....'త్వరలో సముద్రకని దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించబోతున్నాను. నా కెరీర్‌లో సవాల్‌తో కూడుకున్న పాత్ర ఇదే. ప్యాక్ బాడీ కంటే ఎక్కువ కష్టపడాల్సిన ఓ ఎపిసోడ్ ఇందులో ఉంది. మరిన్ని చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి' అన్నారు.


Click it and Unblock the Notifications











