For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫైట్ చేస్తూంటే ప్రమాదం...హీరో నాని కి గాయాలు...రెస్ట్

    By Srikanya
    |

    హైదరాబాద్: నాని హీరోగా కృష్ణ వంశీ దర్శకత్వంలో 'పైసా' చిత్రం రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ జరుగుతూంటే నానికి దెబ్బలు తగిలాయని సమాచారం. వెంటనే దగ్గరలోని హాస్పటిల్ కి తీసుకు వెళ్లి ట్రీట్ చేసారు. డాక్టర్ రెండు వారాలు పాటు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని సూచించినట్లు తెలుస్తోంది.

    ఈ చిత్రంలో కేథరిన్, లక్కీ శర్మ హీరోయిన్లుగా చేస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ఈచిత్రంలో నాని యంగ్ పొలిటీషియన్‌గా కనిపించబోతున్నాడు. దర్శకుడు కృష్ణ వంశీ పాటల చిత్రీకరణలో తన క్రియేటివిటీ చూపిస్తున్నారు. నిర్మాతలు కూడా ఆయన క్రియేటివిటీకి తగిన విధంగా భారీగా ఖర్చు పెడుతున్నారు. కేవలం పాటల చిత్రీకరణ కోసం దాదాపు కోటికిపైగా వెచ్చించినట్లు తెలుస్తోంది.

    అదే విధంగా కాస్టూమ్స్ విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. నాని కాస్ట్యూమ్స్ కోసం స్వారోవ్‌స్కి క్రిస్టల్స్ వాడుతున్నారట. ఓక్కో సూట్ కోసం దాదాపు 20 వేల క్రిస్టల్స్ వాడుతున్నారు. వీటితో తయారు చేసే ఒక్కో సూట్ కు రూ. 7.5 లక్షల వరకు ఖర్చవుతుందట. ఇప్పటి వరకు ఇండియాలో ఏ హీరో కూడా ఇలాంటి సూట్ తో పెర్ఫార్మ్ చేయలేదట. ఇంతకీ వీటికున్న ప్రత్యేకత ఏమిటంటే....మైఖేల్ జాక్సన్ ఇలాంటి క్రిస్టల్స్ తో చేసిన కాస్ట్యూమ్స్ వాడేవారని యూనిట్ సభ్యులు అంటున్నారు.

    ఎల్లోఫ్లవర్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. గతంలో మిరపకాయ నిర్మించిన రమేష్‌ పుప్పాల నిర్మాత. ఇక గోపీచంద్ మొగుడు తర్వాత కృష్ణవంశీ చేస్తున్న చిత్రం ఇదే. ఆ చిత్రం డిజాస్టర్ కావటంతో కొంత గ్యాప్ తీసుకుని ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మొదట ఈ చిత్రానికి పైసాలో పరమాత్మ టైటిల్ అనుకున్నారు. ఆ తర్వాత జెండాపై కపిరాజు అని వార్తలు వచ్చాయ. అయితే పైసాలో పరమాత్మ టైటిల్ వేరే వారు తమ సినిమాకు పెట్టుకుని ఉండటంతో 'పైసా' టైటిల్ ని ఈ చిత్రానికి ఫిక్స్ చేసారు.

    English summary
    Nani is currently in the sets of Krishna Vamsi's 'Paisa'. While the shooting of an action sequence in the movie, hero Nani got injured and is rushed to nearby hospital. Doctors confirmed that Nani got a hairline fracture and suggested to take a bed rest for 2 weeks. Ramesh Puppla is producing this film, while keralite Katherine Theresa is doing her debut in Tollywood
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X