twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మనకు తెలియని 'నాని': ప్రాణం కోసం పరుగు తీసిన క్షణం; ప్యాంట్ తడుపుకుని?..

    |

    నేచురల్ స్టార్ నాని విజయ పరంపర కొనసాగుతూనే ఉంది. ఈ ఏడాది 'నేను లోకల్‌', 'నిన్నుకోరి' సినిమాలతో మెప్పించిన నాని.. తాజాగా 'మిడిల్ క్లాస్ అబ్బాయి'గాను ఆకట్టుకున్నాడు. ఎంసీఏ విజయంతో తన విజయ ప్రస్థానాన్ని ఎంజాయ్ చేస్తున్న నాని.. తన తాజా ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు మీడియాతో పంచుకున్నారు. ఆ విశేషాలు నాని మాటల్లోనే మీకోసం..

    నాని 'హౌజ్ ఫుల్ షో' అలా మొదలైంది: ఈ ఫోటో యాధృచ్చికమే!..నాని 'హౌజ్ ఫుల్ షో' అలా మొదలైంది: ఈ ఫోటో యాధృచ్చికమే!..

    ఎప్పుడైనా తన్నులు తిన్నారా?:

    ఎప్పుడైనా తన్నులు తిన్నారా?:

    అవును.. కాలేజ్ రోజుల్లో జరిగింది ఈ సంఘటన. ఆమె నా ఫ్రెండ్ సిస్టర్. కాలేజీలో ఎవరో ఇబ్బంది పెడుతున్నారని చెబితే.. హీరోలా ఫీలై ఇంప్రెస్ చేయడానికి ట్రై చేశా. కానీ అది బెడిసికొట్టింది. సమస్య తీరిపోతుందనుకున్నాను కానీ, నాకు పడుతాయనుకోలేదు.

     తాగుతారా?:

    తాగుతారా?:

    నన్ను నేను మర్చిపోయేంతలా ఎప్పుడూ తాగలేదు. చిన్న పార్టీ అయినా సరే, నా స్నేహితులు తాగినప్పుడు.. వాళ్లను ఇంటి వద్ద దిగబెట్టే బాధ్యత నాకే అప్పగించేవారు.

    అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది.. ఇలా నన్ను కూడా ఎవరన్నా చూసుకుంటే బాగుంటుందని. సహజంగానే సినిమా విడుదలకు ముందు టెన్షన్ ఉంటుంది. ఆ సమయంలో ఫుల్లుగా తాగేసి పడుకోవాలనుంటుంది. కానీ అలా చేయలేను కదా!

     స్నానం చేయకుండా:

    స్నానం చేయకుండా:

    ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా తీస్తున్నప్పుడు ట్రెక్కింగ్ షూటింగ్ నిమిత్తం హిమాలయాలకు వెళ్లాం. మా టీమ్ లో మొత్తం 33మంది ఉన్నాం. 42రోజులు అక్కడే ఉన్నాం. ఆ 42రోజుల్లో 2 సార్లు మాత్రమే స్నానం చేశాను. మొత్తం టీమ్ లో రెండు రోజులు స్నానం చేసింది నేనొక్కడినే..

     పోలీసుల చేతిలో దెబ్బలు:

    పోలీసుల చేతిలో దెబ్బలు:

    ఎస్.ఆర్.నగర్ నారాయణ కాలేజ్‌లో ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు.. నా ఫ్రెండ్ అనుకోకుండా చేసిన తప్పుకు నాకు దెబ్బలు పడ్డాయి. మరోసారి సత్యం థియేటర్ వద్ద టికెట్ల కోసం వెళ్లి తన్నులు తిన్నాను.

     ప్రాణం కోసం పరుగు తిసిన క్షణం:

    ప్రాణం కోసం పరుగు తిసిన క్షణం:

    వరంగల్ లో ఎంసీఏ షూటింగ్ చేస్తున్నప్పుడు ఒక సంఘటన జరిగింది. వరంగల్ రైల్వే స్టేషన్ రోడ్డులో షూటింగ్. నిజానికి అక్కడ షూటింగ్ చేస్తున్నట్లు కూడా ఎవరికీ తెలియదు. వాకీటాకీలతోనే కమ్యూనికేట్ చేసుకునేవాళ్లం.

    సీన్ ఏంటంటే.. కారు ఆగగానే అందులో నుంచి దిగి.. జనాల మధ్య నుంచి పరిగెత్తుకెళ్లి.. అక్కడికి కొంచెం దూరంలో ఉన్న మరో కారులోకి ఎక్కాలి. కానీ రద్దీ ఎక్కువగా ఉండటంతో నేను ఎక్కాల్సిన కారు.. ముందుకు వెళ్లిపోయింది. అప్పటికే జనం నన్ను గుర్తు పట్టేసి చుట్టుముట్టారు. ఏం చేయాలో తెలియక పక్కనే ఉన్న ఆటోలో ఎక్కేశాను. ఆటో డ్రైవర్ షాక్ తిన్నాడు. ముందున్న కారును ఫాలో చేయమని చెప్పాను.

    భయపడ్డ సందర్భం:

    భయపడ్డ సందర్భం:

    థియేటర్ లో రాంగోపాల్ వర్మ 'దెయ్యం' సినిమా చూస్తున్నప్పుడు.. భయంతో నాకు తెలియకుండానే చేతిలో ఉన్న కోక్ ప్యాంట్ పై పోసుకున్నా. భయంతో ప్యాంట్ తడుపుకున్నాడని ఆ సమయంలో నా ఫ్రెండ్స్ అనుకున్నారు.

     పరీక్షల్లో కాపీ కొట్టారా?

    పరీక్షల్లో కాపీ కొట్టారా?

    చాలాసార్లే కొట్టాను. కానీ ఓసారి దొరికిపోయా. పబ్లిక్ పరీక్షలు రాస్తున్న సమయంలో.. కాపీ కొడుతుండగా స్క్వాడ్ పట్టేసుకున్నాడు. కానీ ఎందుకనో నన్ను డీబార్ చేయకుండా వదిలేశారు. బహుశా నేను నచ్చినట్టున్నాను..

    English summary
    Nani is probably, one of the most talented actors in Tollywood. He has back to back hits. He shared his personal life experiences.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X