నాని, కీర్తి సురేష్ మరోసారి జతకట్టబోతున్నారా?
'నేను లోకల్' చిత్రంలో కలిసి నటించిన నేచురల్ స్టార్ నాని, హీరోయిన్ కీర్తి సురేష్ జంటకు మంచి పేరొచ్చింది. ఇద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్‌లా తెరపై ఒదిగిపోయారు. ఈ సక్సెస్‌ఫుల్ జోడీ మరోసారి కలిసి నటించబోతున్నట్లు సమాచారం.
ప్రస్తుతం నాని హీరోగా 'జెర్సీ' అనే సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్టెన్మెంట్స్ పతాకంపై 'మళ్లీ రావా' ఫేం గౌతం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో నానికి జోడీగా కీర్తి సురేష్‌ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

తెలుగులో సెలెక్టెడ్‌గా సినిమాలు ఎంచుకుంటూ వెళుతున్న కీర్తి సురేష్ ఇటీవల 'మహానటి' సినిమాతో మంచి పేరు తెచ్చుకుంది. నానితో ఆమె కాంబినేషన్‌కు మంచి డిమాండ్ ఉండటంతో ఈవిడనే ఫైనల్ చేసే అవకాశం ఉందని టాక్.
ప్రస్తుతం కీర్తీ సురేష్... తమిళంలో పందెంకోడి 2 సినిమా చేస్తూ బిజీగా గడుపుతోంది. మరో వైపు నాని... నాగార్జునతో కలిసి మల్టీస్టారర్ మూవీ, బిగ్ బాస్ చేస్తూ బిజీగా గడుపుతున్నారు.


Click it and Unblock the Notifications











