మొత్తానికి 'అలా మొదలైంది' నానికి మొదలైంది
'అలా మొదలైంది'తో విజయాన్ని అందుకున్న హీరో నాని కి పూర్తి స్దాయి కెరీర్ మొదలైనట్లే అంటున్నారు.ఎందుకంటే రాజమౌళి దర్సకత్వంలో చేస్తున్న నానికి దర్శకులు కృష్ణవంశీ నుంచి ఆఫర్ వచ్చింది.త్వరలో నానితో ఓ చిత్రాన్ని కృష్ణ వంశీ రూపొందించే అవకాశాలున్నాయి. ప్రస్తుతం గోపీచంద్, తాప్సి జంటగా కృష్ణవంశీ మొగుడు టైటిల్ తో ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.నల్లమలుపు బుజ్జి నిర్మించే ఈ చిత్రం ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది.ఈ చిత్రం అనంతరం నాని నటించే సినిమా ఉంటుందని సమాచారం.ఇక నానితో 'అలా మొదలైంది'వంటి హిట్టిచ్చిన నందినీ రెడ్డి కూడా కృష్ణ వంశీ శిష్యురాలే కావటం విశేషం.


Click it and Unblock the Notifications











