అప్పుడు నవ్వించి.. ఇప్పుడు ఏడిపిస్తూ వెళ్లిపోయాడు.. రాజశేఖర్, మహేష్, నాని సంతాపం

ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్‌ మరణం ఇండస్ట్రీకి తీరని లోటు అని సినీ ప్రముఖులు ఆవేదన చెందుతున్నారు. అతనితో తనకున్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు ఆయన కుటుంబానికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు. వేణు మాధవ్ కుటుంబానికి సంతాపం తెలిపిన వారిలో రాజశేఖర్, మహేష్ బాబు, నరేష్, నాని తదితరులు ఉన్నారు. ప్రతీ ఒక్కరిని భావోద్వేగానికి గురిచేసే విధంగా సోషల్ మీడియాలో సంతాంప వ్యక్తం చేస్తున్నారు. వారు ఏమన్నారంటే..

అక్కా, బావ అంటూ

అక్కా, బావ అంటూ

ప్రముఖ కథానాయకుడు, యాంగ్రీ స్టార్‌ రాజశేఖర్‌ ఓ ప్రకటనలో... ‘వేణుమాధవ్‌తో మా కుటుంబానికి ఎంతో సన్నిహిత మిత్రుడు. నన్ను బావా అని, జీవితను అక్క అని పిలిచేవారు. ప్రతీ పండక్కి తప్పకుండా ఫోన్‌ చేసేవాడు. అంతకు ముందే మెసేజ్‌ చేసి విష్‌ చేసేవాడు. మేమంటే తనకు అంత అభిమానం, ప్రేమ. మేమిద్దరం కలిసి సుమారు పది చిత్రాల్లో నటించాం. ‘మనసున్న మారాజు', ‘రాజ సింహం', ‘ఒక్కడు చాలు', ‘గోరింటాకు' చిత్రాల్లో తన నటనకు, హాస్యానికి మంచి పేరు వచ్చింది. ప్రతీ ఒక్కరినీ వరుసలు పెట్టి పిలుస్తూ కుటుంబంలా కలుపుకుని వెళ్లేవారు అని రాజశేఖర్ తెలిపారు.

Recommended Video

#RIPVenuMadhav : Comedian Venu Madhav Is No More

అప్పుడు నవ్వించి.. ఇప్పుడు ఏడిపిస్తున్నాడు..

అలాంటి మంచి మనిషి ఇంత త్వరగా లోకాన్ని విడిచి వెళతాడని అనుకోలేదు. ‘మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌' (మా) ఎన్నికల సమయంలో వేణుమాధవ్‌కి ఆరోగ్యం బాలేదట! కానీ, ఎవరికీ తెలియన్విలేదు. సాటి కళాకారుల కోసం ముందడుగు వేశారు. ఎన్నికల్లో విజయం సాధించారు. గతవారం ఆయన హాస్పిటల్‌లో ఉంటే వెళ్లి కలిశాను. సోమవారం సాయంత్రం డిశార్జ్‌ అయ్యారు. మళ్లీ సీరియస్‌ అయిందని మంగళవారం అడ్మిట్‌ చేశారు. అందరినీ ఎన్నో ఏళ్లుగా నవ్వించి నవ్వించి ఈ రోజు లోకాన్ని విడిచి వెళ్లి ఏడిపిస్తున్నారు. వేణుమాధవ్‌ మృతి ఇండస్ట్రీకి తీరని లోటు'' అని అన్నారు.

విషాదంలో మునిగా.. మహేష్

వేణు మాధవ్ మృతివార్తతో తీవ్ర విషాదంలో మునిగిపోయాను. ఆయన లేని లోటు తీర్చలేనిది. వేణు మాధవ్ ఆత్మకు శాంతి కలుగాలి. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం అని ప్రిన్స్ మహేష్ బాబు ట్వీట్ చేశారు.

 అద్భుతమైన నటుడు

అద్భుతమైన నటుడు

వేణు మాధవ్ మరణించారనే వార్త నన్ను కలిచి వేసింది. ఆయన ఆకస్మిక మరణంతో ఏర్పడిన లోటు తీర్చలేనిది. అద్భుతమైన నటుడు, కమెడియన్. పలుమార్లు మా సంఘానికి సభ్యుడిగా సేవలందించారు. సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలు వెలకట్టలేనివి అని నటుడు వీకే నరేష్ ట్వీట్ చేశారు.

ఆ సమయంలో నవ్వు ఆపుకోలేకపోయాను..

రాధాగోపాలం షూటింగ్ సమయంలో ఓ అద్భుతమైన సంఘటన జరిగింది. నేను క్లాప్ బోర్డు పట్టుకొని ఉండగా ఆయన చేసిన హాస్యానికి నవ్వు ఆపుకోలేకపోయాను. ఆ విషయం ఎప్పుడు గుర్తొచ్చినా నవ్వుకుంటూ ఉంటాను. అతడి ఎనర్జీ, టైమింగ్ సరితూగలేనివి. ఆకాల మరణంతో విషాదంలో మునిగిన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం అని నాని అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X