షారుక్‌‌ ఖాన్‌తో సమానంగా హీరో నాని, రెమ్యూనరేషన్ కూడా!

By Bojja Kumar

హైదరాబాద్: బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ రేంజ్ ఎక్కడ? ఇప్పుడిప్పుడే కథానాయకుడిగా ఎదుగుతున్న తెలుగు హీరో నాని రేంజి ఎక్కడ. కానీ తనకు షారుక్ ఖాన్‌తో సమానంగా రెమ్యూనరేషన్ ఇస్తారా? అంటూ ప్రముఖ బాలీవుడ్ సినీ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలింస్ అడిగాడు తెలుగు హీరో నాని.

నాని ఇలా అడగటానికి ఓ కారణం కూడా ఉంది. యశ్ రాజ్ ఫిలింస్ సంస్థ త్వరలో సౌతిండియా సినీ పరిశ్రమలోకి అడగు పెట్టాలనుకుంటోంది. హిందీలో విజయవంతమైన 'బ్యాండ్ బాజా భారత్' చిత్రం తెలుగు, తమిళం రీమేక్‌ను తన తొలి సౌత్ ప్రాజెక్టుగా చేస్తోంది. ఇందులో నాని హీరోగా ఎంపికయ్యాడు. యష్ రాజ్ ఫిలింస్ న్యూవెంచర్లో చేస్తున్న తొలి సౌత్ హీరో నాని కావడం విశేషం. ఆదిత్య చోప్రా నిర్మాత.

ప్రస్తుతం నాని 'బ్యాంబ్ బాజా భారత్' సినిమా రీమేక్‌లో భాగంగా ముంబైలో ఫోటో షూట్‌కు హాజరయ్యాడు. ఈ విషయాన్ని నాని వెల్లడిస్తూ.... 'నేను యష్ రాజ్ ఫిలింస్‌ స్టూడియోలో ఫోటో షూట్‌కు హాజరయ్యాను. వారు నా కొలతలు బాలీవుడ్ స్టార్ హీరో షారుక్‍‌తో సమానంగా ఉన్నాయని చెప్పారు. అప్పుడు నేను వారిని ఫన్నీగా... అలా అయితే షారుక్‌తో సమానంగా రెమ్యూనరేషన్ ఇస్తారా అని అడిగాను' అని చెప్పుకొచ్చారు.

యస్ రాజ్ ఫిలిమ్స్ తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్న 'బ్యాండ్ బాజా భారత్' రిమేక్ లో నటించడానికి రూ. 2.5 కోట్లు ఆఫర్ చేసిందనే వార్త టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అసిస్టెంట్ డైరెక్టర్ గా తన కెరియర్ ప్రారంభించి, అతి తక్కువ కాలంలో టాలీవుడ్ లో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్న నాని, ఈగ సినిమా సూపర్ హిట్ అవడంతో అటు కోలీవుడ్ లోనూ ఇటు టాలీవుడ్ లోను కూడా నానికి మంచి ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం "జండా పై కపిరాజు", "పైసా" సినిమాలలో నటిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X