Hi Nanna Business: నాని మూవీకి రికార్డు బిజినెస్.. ఎన్ని కోట్లు వస్తే హిట్ అవుతుందో తెలుసా?
నేచురల్ స్టార్ నాని తాజాగా నటిస్తున్న చిత్రం హాయ్ నాన్న. దసరా లాంటి మాస్ ఎంటర్ టైనర్ తర్వాత నాని నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఈ సినిమా. ఇక ఈ చిత్రానికి కొత్త దర్శకుడు శౌర్యువ్ ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ రావడంతో ప్రపంచవ్యాప్తంగా మంచి బిజినెస్ నమోదు చేసుకుంది. దసరా రేంజులో జోరు చూపించకపోయినా.. పర్వాలేదనిపించంది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
నూతన దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన చిత్రం హాయ్ నాన్న. ఈ మూవీలో హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ నటిస్తుంది. తండ్రి కూతురు మధ్య ఉన్న ఎమోషన్స్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కిందిం. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్, పోస్టర్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి. ఇక ఈ సినిమా డిసెంబర్ 7న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది.

మలయాళ నటుడు జయరాం, హీరోయిన్ శృతి హాసన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు హేషం అబ్దుల్ వహద్ సంగీతం అందించగా వైరా ఎంటర్టైన్మెంట్స్ నిర్మించారు. ఇక ఈ సినిమా డిజిటల్ హక్కులను కూడా ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ భారీ ధరకు కొనుగోలు చేసింది. ఇక హిందీ నాన్ థియేట్రికల్ హక్కుల డీల్స్ విషయానికి వస్... హిందీలో ఏడున్నర కోట్ల డీల్ కంప్లీట్ చేసుకోగా ఓటిటిలో అన్ని భాషలకి కలిపి ఏకంగా 37 కోట్లతో ఓ ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ లాక్ చేసుకున్నట్టు సమాచారం.

ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు కూడా బయటకు వచ్చాయి. దసరా సినిమా రేంజులో కాకపోయినా.. భారీగానా ఈ సినిమా బిజినెస్ నమోదు చేసుకుంది. దసరా సినిమా రూ.115 కోట్ల బిజినెస్ చేసుకుని నాని కెరియర్ లో హైయెస్ట్ బిజినెస్ సినిమా అదే.
ఇక హాయ్ నాన్న సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు చూసుకుంటే...ప్రపంచవ్యాప్తంగా నైజం రూ. 8.50కోట్లు, సీడెడ్ రూ 2.60 కోట్లు, ఆంధ్ర రూ.9 కోట్లు నమోదు చేసుకోగా... తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా రూ.20.10 కోట్లు నమోదు చేసుకుంది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో రూ.2 కోట్లు కాగా... ఓవర్సీస్ లో రూ.5.50 కోట్లు కాగా.. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ. 27.60 కోట్ల బిజినెస్ చేసుకుంది.

ఇక హాయ్ నాన్న సినిమా రూ.28.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో ఈ సినిమా బాక్సాఫీస్ బరిలోకి దిగనుంది. టాక్ బాగుంటే ఈ టార్గెట్ నానికి కష్టమేమి కాదు.. ఈజీగానే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ కానుందని అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తుంది. రిలీజ్ చేసిన ట్రైలర్స్, పాటలు ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ సినిమా రేపు థియేటర్లోకి రానుంది. చూడాలి మరి హాయ్ నాన్న ఏ రేంజులో ఆకట్టుకుంటుందో.


Click it and Unblock the Notifications











