అదిరింది: 'ఎంసీఏ'కి నాని కొత్త నిర్వచనం.., ఏం చెప్పాడో తెలుసా?
షార్ట్ కట్‌లో పెట్టే క్యాచీ టైటిల్స్‌ను సందర్భానికి అనుగుణంగా మార్పు చేసుకునే వీలుంటుంది. ఒక రకంగా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ఇదో ట్రిక్. నేచురల్ స్టార్ నాని ఇప్పుడిదే ట్రిక్ ఫాలో అవుతున్నారు. క్రిస్మస్ పండుగ వేళ.. ఇటీవల విడుదలైన 'ఎంసీఏ' చిత్రానికి నాని కొత్త నిర్వచనం చెప్పారు.

ఎంసీఏకి కొత్త నిర్వచనం:
ఎంసీఏ అంటే.. 'మెర్రీ క్రిస్మస్ అందరికీ' అంటూ కొత్త నిర్వచనం చెప్పారు నాని. నేడు క్రిస్మస్ పండుగ కావడంతో తన ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.
ట్వీట్ వైరల్:
నాని చేసిన ఈ ట్వీట్ కాసేపట్లోనే వైరల్ అయింది. గంటలోనే వేల కొద్ది లైక్స్, రీట్వీట్స్‌తో ఆ పోస్ట్ వైరల్ అయింది. క్రిస్టియన్ సోదరులకు పండగు శుభాకాంక్షలు తెలపడం పట్ల ఆ వర్గం నుంచి హర్షం వ్యక్తమవుతోంది.

నిలకడగా కలెక్షన్స్:
ఎంసీఏ సినిమాకు బాక్స్ ఆఫీస్ వద్ద మిశ్రమ స్పందన లభించినప్పటికీ.. కలెక్షన్ల విషయంలో సినిమా నిలకడగా రాణిస్తోంది.
నాని గత చిత్రం 'నిన్నుకోరి' ఓపెనింగ్స్ కంటే 'ఎంసీఏ' అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టినట్లు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా తొలిరోజున దాదాపు రూ.15కోట్ల వరకు ఈ సినిమా వసూలు చేసినట్లు టాక్.

నాని కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్స్:
నాని కెరీర్‌లోనే ఎంసీఏ అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా నిలిచిపోయింది. ప్రత్యేకించి ఓవర్సీస్, మల్టీప్లెక్స్ లలో ఈ సినిమాకు తిరుగులేదనేది ట్రేడ్ పండితుల అభిప్రాయం. అయితే లాంగ్ రన్‌లో ఈ సినిమా ఎంతమేర నిలబడుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











