నాని కొత్త చిత్రం 'జెండాపై కపిరాజు'

ఈ చిత్రం విషయమై చిత్ర నిర్మాత కె.ఎస్.శ్రీనివాసన్ మాట్లాడుతూ ''కొత్త తరహా కథ, కథనాలతో '... కపిరాజు' రూపుదిద్దుకోబోతోంది. ఆగస్టు 1 నుంచి చిత్రీకరణ మొదలుపెడతాము''అన్నారు. ఈ విషయమై నాని మాట్లాడుతూ....త్వరలో సముద్రకని దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించబోతున్నాను. నా కెరీర్‌లో సవాల్‌తో కూడుకున్న పాత్ర ఇదే. ప్యాక్ బాడీ కంటే ఎక్కువ కష్టపడాల్సిన ఓ ఎపిసోడ్ ఇందులో ఉంది. మరిన్ని చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి అన్నారు. పాటలు: అనంత్ శ్రీరామ్, సంగీతం: జి.వి.ప్రకాష్.
ప్రస్తుతం నాని..కృష్ణవంశీ దర్శకత్వంలో పైసా అనే చిత్రం చేస్తున్నారు. ఆ చిత్రం కూడా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నాడు. తమిళ దర్శకుడు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఎటో వెళ్లిపోయింది మనసు' చిత్రంలో చేస్తున్నారు. ఆ చిత్రంలో నానితో సమంతతో మరోసారి నటించడం నుంది. ఇక తన తాజా చిత్రం ఈగ గురించి చెపుతూ..'ఈగ' అనేది టెక్నికల్ సినిమా. దాంట్లో ఉన్న నా క్యారెక్టర్ని మీరూ,నేనూ కూడా పోషించగలం. ఎందుకో దర్శకుడు నన్ను అభిమానించాడు కనుక నాకు ఆ పాత్ర వచ్చింది. నేను రాజమౌళిగారి డైరెక్షన్‌లో చెయ్యడం అదృష్టం అని చెప్పుకొచ్చారు.
ఈగ సినిమాలో నేను నటించనంత మాత్రాన ఆ సినిమాకు నేనే హీరోనని కాలర్ ఎగురేయలేను. నేనేమీ పెద్ద కమర్షియల్ హీరోని కాదు. సమంతతో నటించడం, ఒకటి రెండు పాటలకు ఆమెతో పనిచేయడంలాంటివన్నీ పేరుకే మాత్రం. ఇంకా హీరోగా నిలబడాలంటే ఇంకొన్ని చిన్న సినిమాలు చేయాల్సి ఉంటుంది. అలాంటి సినిమాల్లో నా సత్తా ఏపాటిదో నిరూపించుకోవాల్సి వుంటుంది. అంతదాకా నేను కృషి చేయాలి. అప్పుడే హీరోగా పేరు తెచ్చుకుంటాను అన్నారు.


Click it and Unblock the Notifications











