»   » హీరో నాని రెమ్యూనరేషన్ పెంచాడు!

హీరో నాని రెమ్యూనరేషన్ పెంచాడు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఆ మద్య వరుస ప్లాపులతో సతమతం అయిన హీరో నాని ‘భలే భలే మగాడివోయ్' సినిమాతో మళ్లీ హిట్ టాక్ ఎక్కాడు. ఈ సినిమా ఇండియాతో పాటు ఓవర్సీస్ లో కూడా మంచి వసూళ్లు సాధించిందది. ఆ సినిమా తర్వాత నానికి డిమాండ్ బాగా పెరిగింది. దీంతో ఈ ప్రభావం ఆటో‌మేటిక్ గా అతని రెమ్యూనరేషన్ మీద కూడా పడింది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం నాని ఇపుడు ఒక్కో సినిమాకు రూ. 4 కోట్ల వరకు చార్జ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అతని సినిమాలను ప్యామిలీ ఆడియన్స్, ఓవర్సీస్ ఆడియన్స్ బాగా ఆధరిస్తుండటంతో నిర్మాతలు కూడా అతనికి అంత మొత్తం ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు.

ప్రస్తుతం నాని ‘జై బాలయ్య' అనే సినిమాలో నటిస్తున్నాడు. ‘అందాల రాక్షసి' ఫేమ్ హను రాఘవపూడి డైరెక్షన్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో నాని బాలయ్య అభిమాన సంఘం అధ్యక్షుడిగా నటించబోతున్నాడు. సినిమాలో ఆయన చేతిపై ‘జై బాలయ్య' అనే టాటూతో కనిపిస్తారు.

Nani now charging Rs 4 crore per film

వాస్తవానికి ‘జై బాలయ్య' మూవీ స్టోరీ బేసికల్ గా ఓ లవ్ స్టోరీ. అయితే హీరో బాలయ్య వీరాభిమాని. లవ్ స్టోరీతో ఈ టైటిల్ కు ఏ విధంగా న్యాయం చేస్తారో సినిమా చూస్తేగానీ చెప్పడం కష్టమే. బాలయ్యతో ‘లెజెండ్' లాంటి బ్లాక్ బస్టర్ తీసిన 14 రీల్స్ వాళ్లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

నిర్మాతలు రామ్ ఆచంట - గోపి ఆచంట - అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరకుంది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో నాని అనంతపూర్ నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పాత్రలో కనిపించనున్నాడు.. అందువల్ల ఈ చిత్రానికి ‘జై బాలయ్య' అనే టైటిల్ ను చిత్ర యూనిట్ పరిశీలిస్తున్నారు.

English summary
Actor Nani is now charging Rs 4 crore per film which industry sources say is entirely justified when one considers the collections of ‘BBM’.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu