Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
నానికి ఓటీటీ ఆఫర్స్.. సైడ్ బిజినెస్ కోసం స్పెషల్ ప్లాన్?
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్ హీరోలు ఉన్నా కూడా నానికి ఉండే క్రేజ్ చాలా డిఫరెంట్ గా ఉంటుందనే చెప్పాలి. నేచురల్ స్టార్ నానిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ సెట్ చేసుకున్న ఈ టాలెంటెడ్ హీరో మొదట దర్శకుడు అవ్వాలని ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. ఈ విషయం అందరికి తెలిసే ఉంటుంది. అయితే ఆ డైరెక్షన్ ఆలోచన ప్రస్తుతానికైతే లేదని చెప్పిన నాని తన సినిమాల్లోనే ఒక దర్శకుడు చేసే పని చూస్తూ అనేక రకాల మెళకువలు నేర్చుకున్నాడట.
ఇటీవల కొన్ని కథలు కూడా రసుకున్నట్లు టాక్ వస్తోంది. అయితే త్వరలోనే ఒక డిఫరెంట్ థ్రిల్లర్ లవ్ స్టోరీని వెబ్ సిరీస్ గా రూపొందించే ఛాన్స్ ఉన్నట్లు టాక్ వస్తోంది. నాని డైరెక్ట్ చేస్తాడా లేదా అనే విషయంలో ఇంకా క్లారిటి రాలేదు గాని తప్పకుండా నిర్మాతగా వ్యవహరించే ఛాన్స్ ఉన్నట్లు టాక్ వస్తోంది. నానికి మొదటి నుంచే ఓటీటీ కంపెనీలు ఆఫర్స్ కూడా ఇస్తున్నట్లు సమాచారం. మంచి కంటెంట్ వస్తే తప్పకుండా లాభాలు అందేలా ఓటీటీ కంపెనీల నుంచి ఆఫర్స్ కూడా వస్తున్నాయట. దీంతో సైడ్ బిజినెస్ గా మంచి హెల్ప్ అవుతుందని నాని సరికొత్తగా ఆలోచిస్తున్నాడట.
ప్రస్తుతం నాని V సినిమా ఓటీటీ విడుదలకు సిద్దమైన విషయం తెలిసిందే. ఎప్పుడో సమ్మర్ లో రావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో సెప్టెంబర్ 5న విడుదల కానుంది. సినిమా ఎంతవరకు సక్సెస్ టాక్ ను అందుకుంటుందో తెలియదు గాని నిర్మాత దిల్ రాజు మాత్రం పెద్దగా నష్టపోలేదని తెలుస్తోంది. ఇక నానికి V 25వ సినిమా కావడం విశేషం. మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సుధీర్ బాబు, నివేత థామస్, అదితి రావ్ హైదరి ముఖ్య పాత్రల్లో నటించారు.