నాని ‘పైసా' కి అంత డిమాండా?
హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు కృష్ణ వంశీ ప్రస్తుతం నాని హీరోగా రూపొందిస్తున్న చిత్రం 'పైసా' . ఈ చిత్రానికి అప్పుడే బాలీవుడ్ నుంచి రీమేక్ ఆఫర్స్ వస్తున్నట్లు,రైట్స్ కోసం వార్ జరుగుతున్నట్లు కొన్ని పత్రికల్లో వచ్చింది. శ్రీదేవి భర్త బోనీకపూర్ ఈ చిత్రం కొని తన కుమారుడు అర్జున్ కపూర్ తో రీమేక్ చేయాలని భావిస్తున్నట్లు బాలీవుడ్ సమాచారం.
మరో ప్రక్క షాహిద్ కపూర్ కూడా ఈ చిత్రం రైట్స్ తీసుకుని తనే సొంతంగా బ్యానర్ పెట్టుకుని ఈ చిత్రం రీమేక్ చేయాలనకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలు మీడియాని మ్యానేజ్ చేసి, క్రియేట్ చేసినవని కొందరంటున్నారు. తెలుగులోనే ఈ చిత్రం పెద్దగా క్రేజ్ తెచ్చుకోలేకపోయింది. హిందీ వాళ్లు ఇక్కడ హిట్ అయిన సినిమాలు తీసుకుంటారు లేదా పెద్ద హీరోల సినిమాలు ఎంక్వైరీ చేస్తారు..లేదా రిలీజయ్యేవరకూ ఆగుతారంటున్నారు.
ఇక డబ్బు వల్ల మానవ సంబంధాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. అందరూ డబ్బు మాయలో పడి జీవితపు ఆనందాల్ని విస్మరిస్తున్నారు.. అన్న తాత్విక దృష్టికోణంలో 'పైసా' సినిమా తీశాను అన్నారు కృష్ణవంశీ.
సుదీర్ఘ విరామం తర్వాత ఆయన దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'పైసా'. '11 ఇన్‌కార్నేషన్' అని ఉపశీర్షిక. నాని హీరో . కాథరిన్, సిద్ధికా శర్మ హీరోయిన్స్. ఎల్లో ఫ్లవర్స్ పతాకంపై రమేష్‌పుప్పాల నిర్మించారు.రాజకీయాల నేపథ్యంలోనే సినిమా ఉంటుందని, యంగ్ పొలిటిషీయన్ గా హీరో పాత్ర ఆదర్శ వంతంగా ఉంటుందని చెప్తున్నారు.
గోపీచంద్ మొగుడు తర్వాత కృష్ణవంశీ చేస్తున్న చిత్రం ఇదే. ఆ చిత్రం డిజాస్టర్ కావటంతో కొంత గ్యాప్ తీసుకుని ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మొదట ఈ చిత్రానికి పైసాలో పరమాత్మ టైటిల్ అనుకున్నారు. ఆ తర్వాత జెండాపై కపిరాజు అని వార్తలు వచ్చాయ. అయితే పైసాలో పరమాత్మ టైటిల్ వేరే వారు తమ సినిమాకు పెట్టుకుని ఉండటంతో పైసా టైటిల్ ని ఈ చిత్రానికి ఫిక్స్ చేసారు.


Click it and Unblock the Notifications











