twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాని ‘పైసా’ ఫస్ట్ లుక్ ఇదేనా?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: క్రియేటివ్ దర్శకుడు కృష్ణ వంశీ ప్రస్తుతం నాని హీరోగా 'పైసా' చిత్రం రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కేథరిన్, లక్కీ శర్మ హీరోయిన్లుగా చేస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. తాజాగా ఈచిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ఇదే అంటూ ఓ ఫోటో నెట్లో హల్ చల్ చేస్తోంది.

    ఈచిత్రంలో నాని యంగ్ పొలిటీషియన్‌గా కనిపించబోతున్నాడు. దర్శకుడు కృష్ణ వంశీ పాటల చిత్రీకరణలో తన క్రియేటివిటీ చూపిస్తున్నారు. నిర్మాతలు కూడా ఆయన క్రియేటివిటీకి తగిన విధంగా భారీగా ఖర్చు పెడుతున్నారు. కేవలం పాటల చిత్రీకరణ కోసం దాదాపు కోటికిపైగా వెచ్చించినట్లు తెలుస్తోంది.

    అదే విధంగా కాస్టూమ్స్ విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. నాని కాస్ట్యూమ్స్ కోసం స్వారోవ్‌స్కి క్రిస్టల్స్ వాడుతున్నారట. ఓక్కో సూట్ కోసం దాదాపు 20 వేల క్రిస్టల్స్ వాడుతున్నారు. వీటితో తయారు చేసే ఒక్కో సూట్ కు రూ. 7.5 లక్షల వరకు ఖర్చవుతుందట. ఇప్పటి వరకు ఇండియాలో ఏ హీరో కూడా ఇలాంటి సూట్ తో పెర్ఫార్మ్ చేయలేదట. ఇంతకీ వీటికున్న ప్రత్యేకత ఏమిటంటే....మైఖేల్ జాక్సన్ ఇలాంటి క్రిస్టల్స్ తో చేసిన కాస్ట్యూమ్స్ వాడేవారని యూనిట్ సభ్యులు అంటున్నారు.

    ఎల్లోఫ్లవర్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. గతంలో మిరపకాయ నిర్మించిన రమేష్‌ పుప్పాల నిర్మాత. ఇక గోపీచంద్ మొగుడు తర్వాత కృష్ణవంశీ చేస్తున్న చిత్రం ఇదే. ఆ చిత్రం డిజాస్టర్ కావటంతో కొంత గ్యాప్ తీసుకుని ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మొదట ఈ చిత్రానికి పైసాలో పరమాత్మ టైటిల్ అనుకున్నారు. ఆ తర్వాత జెండాపై కపిరాజు అని వార్తలు వచ్చాయ. అయితే పైసాలో పరమాత్మ టైటిల్ వేరే వారు తమ సినిమాకు పెట్టుకుని ఉండటంతో 'పైసా' టైటిల్ ని ఈ చిత్రానికి ఫిక్స్ చేసారు.

    English summary
    Nani's upcoming film Paisa first look poster is doing rounds on the internet. Krishna Vamsi is weilding the megaphone for Paisa. Catherine Thresa has been paired opposite Nani in this flick which is in the last leg of shooting.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X