నాని 'పిల్ల జమిందార్' కధేంటి?
అలా మొదలైంది చిత్రంతో విజయం సాధించిన నాని చేస్తున్న తాజా చిత్రం 'పిల్ల జమిందార్'. ఆవకాయ బిర్యాని అమ్మాయి బిందుమాధవి హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రాన్ని అశోక్.జి డైరక్ట్ చేస్తున్నాడు.ఈ చిత్రంలో కథ ప్రకారం ...పేరు ప్రతిష్టలున్న కుటుంబం నుంచి వచ్చిన కుర్రాడు నాని. కానీ అవేం అతనికి పట్టవు. చేసేవన్నీ ఆకతాయి పనులే. అతను ఏం చేసినా చిరిగి చేటంత అవుతుంది. ఏమైనా అడిగితే - పైగా మా తాతలా నేను ఎందుకుండాలి అంటూ ఎదురు ప్రశ్నిస్తాడు. పెద్దాయన్ని చూసి ఇతగాడి ఆగడాల్ని ఊళ్లోవాళ్లు భరిస్తుంటారు. చివరకు అతనిలో మార్పు వస్తుంది. అందుకు కారణం ఇద్దరు యువతులు. వాళ్లెవరు? వారి కథేమిటన్నది తెరపైనే చూడాలి.ఇక ఈ చిత్రంలో సెకెండ్ హీరోయిన్ గా హరిప్రియ చేస్తోంది.
దర్శకుడు అశోక్ గతంలో ఫ్లాష్ న్యూస్,ఉషోదయం,ఆకాశ రామన్న చిత్రాలను డైరక్ట్ చేసాడు.ఎస్.ఎస్.బుజ్జిబాబు నిర్మాత. షూటింగ్ ఇప్పటికే పూర్త యింది. చిత్ర సమర్పకులు డి.యస్.రావు మాట్లాడుతూ... వినోదానికి పెద్ద పీట వేశాం. వచ్చే నెల రెండో వారంలో పాటల్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. అవసరాల శ్రీనివాస్, రావు రమేష్, రణధీర్, ఎమ్మెస్ నారాయణ, డా||శివప్రసాద్, మేఘనా నాయుడు తదితరులు ఇతర పాత్రధారులు. సంగీతం: సెల్వ గణేష్.
ఇక నాని ఈ చిత్రంతో పాటు రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈగ చిత్రం చేస్తున్నాడు.సమంత హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం గ్రాఫిక్ వర్క్ లో బిజీగా ఉంది. అలాగే ఆ మద్య నాని హీరోగా వచ్చిన సెగ చిత్రం భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ అయ్యింది. నాని ఈ పిల్ల జమిందారు చిత్రంపై చాలా ఆశలు పెట్టుకుని ఉన్నాడు.


Click it and Unblock the Notifications











