హీరో నాని చేతిపై ‘జై బాలయ్య’ టాటూ (ఫోటో)
ఇటీవలే ‘భలే భలే మగాడివోయ్' సినిమాతో హిట్టు కొట్టిన నాని ‘అందాల రాక్షసి' ఫేమ్ హను రాఘవపూడి డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో నాని బాలయ్య అభిమాన సంఘం అధ్యక్షుడిగా నటించబోతున్నాడు. సినిమాలో ఆయన చేతిపై జై బాలయ్య అనే టాటూతో కనిపిస్తారు.

గతంలో మన హీరోలు ఎన్టీఆర్, చిరంజీవి, రజినీకాంత్ లాంటి హీరోల అభిమానులుగా నటించడం చూశాం. కానీ బాలయ్య అభిమానిగా చాల రేర్. మరి బాలయ్య అభిమానిగా నాని ఏం చేస్తాడా.. బాలయ్య డైలాగులేమైనా పేలుస్తాడా అన్నది ఆసక్తికరంగా మారింది. బాలయ్య ఫ్యాన్స్ కూడా ఈ క్యారెక్టర్ను ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.
బాలయ్యతో ‘లెజెండ్' లాంటి బ్లాక్బస్టర్ తీసిన 14 రీల్స్ వాళ్లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ‘సైజ్ జీరో' మూవీ ప్రీమియర్ షోకు హాజరైన నాని తన చేతిపై ‘జై బాలయ్య' టాటూతో కనిపించారు. దీన్ని బట్టి ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతోందని స్పష్టం అవుతోంది.


Click it and Unblock the Notifications











