రాజమౌళి,కృష్ణవంశీలకు నాని ఛాలెంజ్(వీడియో)
హైదరాబాద్: ప్రముఖ దర్శకులు రాజమౌళి, కృష్ణవంశీ, మోహన్ కృష్ణ ఇంద్రగంటిలకు ఛాలెంజ్ చేసారు హీరో నాని. దేని గురించి ఈ ఛాలెంజ్ అంటారా..నేను నా భార్య కోసం ఉపవాసం ఉంటున్నాను..మీరు కూడా ఉండండి అని..ఈ ఛాలెంజ్ హఠాత్తుగా ఎందుకు వదిలాడు అంటే మీరు నాని విడుదల చేసిన ఈ వీడియో చూడాల్సిందే.
ఇక చేతిలో ఎప్పుడూ రెండు మూడు సినిమాలతో బిజీగా ఉండే హీరో నాని. అయితే వరస ఫ్లాపులతో ఈ మధ్య కాలంలో ఆయన రేసులో వెనక బడ్డారు. అయితే తిరిగి తనేంటో చూపటానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు.
అంతేకాదు ఈ మధ్య కథల విషయంలో ఆచి తూచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఆయన నుంచి సినిమా సంగతులేం వినిపించడం లేదు. ఇప్పుడు మళ్లీ బిజీ అవుతున్నాడు. వరుసగా రెండు సినిమాల్ని సెట్స్‌పైకి తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నారు నాని.

'అందాల రాక్షసి'తో ఆకట్టుకొన్నారు హను రాఘవపూడి. ఇప్పుడాయన నాని కోసం ఓ కథ సిద్ధం చేసుకొన్నట్టు తెలిసింది. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశాలున్నాయి. నాగు అనే కొత్త దర్శకుడి కథకీ నాని ఓకే చెప్పారట. ఈ రెండు సినిమాల సంగతులూ త్వరలో తెలుస్తాయి.


Click it and Unblock the Notifications











