మరో చిత్రం కమిటైన హీరో నాని... డిటేల్స్
ప్రస్తుతం నాని... కృష్ణవంశీ దర్శకత్వంలో 'పైసా' చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రంలో కేథరిన్, సిద్ధిక శర్మ హీరోయిన్లుగా చేస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. తాజాగా ఈచిత్రం ఆడియో విడుదల తేదీ ఖరారైంది. ఏప్రిల్ 19న నోవాటెల్ హోటల్ లో ఆడియో రిలీజ్ వేడుక చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలో విడుదల తేదీ కూడా ఖరారు కానుంది.
ఈ చిత్రంలో నాని పేరు... ప్ర'క్యాష్'(Pra'Cash'). డబ్బు కంటే అతనికి ఏదీ ఎక్కువ కాదు. ఈచిత్రంలో నాని యంగ్ పొలిటీషియన్‌గా కనిపించబోతున్నాడు. దర్శకుడు కృష్ణ వంశీ మార్కుకు ఏమాత్రం తగ్గకుండా ఈచిత్రం ఉండబోతోంది. అన్ని కోణాల్లో తనదైన ముద్దవేస్తూ ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
ఎల్లోఫ్లవర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. గతంలో మిరపకాయ నిర్మించిన రమేష్ పుప్పాల నిర్మాత. ఇక గోపీచంద్ మొగుడు తర్వాత కృష్ణవంశీ చేస్తున్న చిత్రం ఇదే. ఆ చిత్రం డిజాస్టర్ కావటంతో కొంత గ్యాప్ తీసుకుని ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మొదట ఈ చిత్రానికి పైసాలో పరమాత్మ టైటిల్ అనుకున్నారు. ఆ తర్వాత జెండాపై కపిరాజు అని వార్తలు వచ్చాయ. అయితే పైసాలో పరమాత్మ టైటిల్ వేరే వారు తమ సినిమాకు పెట్టుకుని ఉండటంతో 'పైసా' టైటిల్ ని ఈ చిత్రానికి ఫిక్స్ చేసారు.


Click it and Unblock the Notifications












