భలే భలే 'నాని' అనిపించుకున్నావోయ్...
హైదరాబాద్ : సింగిల్ డైలాగుని సింగిల్ టేక్ లో చెప్పటానికే చాలా మంది హీరోలు తడబడతూంటారు. అలాంటిది ఎనిమిది పేజీలు డైలాగుని సింగిల్ టేక్ లో చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు హీరో నాని. ఈ విషయాన్ని ‘భలే భలే మగాడివోయ్' నిర్మాత మీడియాకు తెలియచేసారు.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
నాని, లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్న చిత్రం ‘భలే భలే మగాడివోయ్'. అల్లు అరవింద్ సమర్పణలో మారుతి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. గీతా ఆర్ట్స్‌లో ఓ విభాగమైన జిఎ2, యూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 90 శాతం టాకీతో పాటు రెండు పాటల చిత్రీకరణ పూర్తయ్యిందనీ, ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో మరో పాటను చిత్రీకరిస్తున్నామనీ నిర్మాత బన్ని వాసు తెలిపారు.
నిర్మాత మాట్లాడుతూ... ‘‘ఇప్పటివరకూ చెయ్యని పాత్రను ఈ చిత్రంలో చేస్తున్నాడు నాని. ఎనిమిది పేజీల డైలాగ్‌ని సింగిల్ టేక్‌లో చెప్పి యూనిట్‌తో క్లాప్స్ కొట్టించుకున్నాడు. నాని కెరీర్‌లోనే ఈ సినిమా హైలైట్‌గా నిలుస్తుంది. నాని, లావణ్య మధ్య వచ్చే లవ్, రొమాంటిక్ సీన్స్ గిలిగింతలు పెడతాయి. ఆన్‌స్ర్కీన్ లవ్‌లీ పెయిర్‌గా వారు ఆకట్టుకుంటారు.

దర్శకుడు మారుతి ఈ చిత్రాన్ని పూర్తి స్థాయిలో వినోదాత్మకంగా రూపొందిస్తున్నారు. హీరో హీరోయిన్లతో పాటు ప్రతి పాత్రా వైవిధ్యంగా ఉండేలా తెరకెక్కిస్తున్నారు. వెన్నెల కిశోర్, శ్రీనివాసరెడ్డి, షకలక శంకర్, భద్రం కడుపుబ్బ నవ్విస్తారు. జాతీయ అవార్డు గ్రహీత గోపిసుందర్ సారథ్యంలో కేరళలో మ్యూజిక్ కంపోజిషన్స్ జరుగుతున్నాయి. జూన్‌లో షూటింగ్ పూర్తిచేసి, ఆగ్‌స్టలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అని ఆయన చెప్పారు.
మురళీశర్మ, నరేష్, సితార, స్వప్నమాధురి, శ్రీనివాసరెడ్డి, వెన్నెల కిషోర్, ప్రవీణ్, షకలక శంకర్, భద్రమ్ తదితరులు నటిస్తున్నారు.ఛాయాగ్రహణం: నిజార్ షఫి, సంగీతం: గోపీసుందర్, కళ:
ఫీల్‌గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ చిత్రంలో నాని పాత్ర చిత్రణ సరికొత్త పంథాలో వుంటుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. శ్రీదివ్య కథానాయికగా నటించనున్న ఈ చిత్రం త్వరలో సెట్స్‌మీదకు వెళ్లనుంది. టైటిల్‌కు సంబంధించిన అధికారిక సమాచారాన్ని త్వరలో వెల్లడించనున్నారు.
ఇక నాని త్వరలో....'బాహుబలి' ఆడియోకు యాంకర్ గా వ్యవరించనున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న 'బాహుబలి' సినిమా తొలి భాగం 'బాహుబలి ది బిగినింగ్' పాటల విడుదల కార్యక్రమం ఈ నెల 31న హైదరాబాద్‌లో జరగనుంది. ఇదే వేదికపై రెండు నిమిషాల ఐదు సెకన్ల నిడివితో సాగే థియేట్రికల్ ట్రైలర్‌ని కూడా విడుదల చేస్తారు. ఈ కార్యక్రమానికి హీరో నాని వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడు.
ఈ విషయాన్ని రాజమౌళి తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. ''మా 'బాహుబలి' ఆడియో విడుదల కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించడానికి అంగీకరించిన మా 'ఈగ'కు ధన్యవాదాలు'' అని రాసుకొచ్చారు రాజమౌళి.


Click it and Unblock the Notifications











