ఆశ్చర్యమా? అనుమానమా?.. ‘జెర్సీ’పై నాని రియాక్షన్ వైరల్

నాని హీరోగా వచ్చిన జెర్సీ చిత్రానికి అంతర్జాతీయంగా గుర్తింపు లభించింది. తెలుగు నాట విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్న జెర్సీ.. భారత అంతర్జాతీయ టొరంటో చలన చిత్రోత్సవంలో ప్రదర్శనకు ఎంపికైంది. ఈ మేరకు చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తోంది. నిర్మాత సూర్యదేవర నాగవంశీ తన సంతోషాన్ని పంచుకున్నాడు. ఈ మేరకు మీడియాతో మాట్లాడాడు.

భారత అంతర్జాతీయ టొరంటో చలన చిత్రోత్సవంలో ప్రదర్శనకు 'జెర్సీ' ఎంపికవటం ఆనందంగా ఉందన్నాడు. ఈ ఏడాది ఆగస్టు 9 నుంచి, 15 వరకు జరిగే ఈ చిత్రోత్సవంలో ఈ సినిమా ప్రదర్శనకు నోచుకోవటం, ఈ విషయాన్ని మీడియాతో పంచుకోవటం తమ కెంతో సంతోషాన్ని కలిగిస్తోందని అన్నాడు. ఈ సినిమా నాని కెరీర్‌‌లో చెప్పుకోదగ్గది. అప్పుడప్పుడే కమర్షియల్ పంథాలో వెళ్తూ ఫెయిల్యూర్స్‌ను చవిచూస్తున్న నానికి సరైన కథ పడింది. మళ్లీ తన నట విశ్వరూపాన్ని చూపి జెర్సీని ఓ కానుకగా తన అభిమానులకు అందించాడు.

Nani Reaction On Jersey Movie SCREENING AT TORONTO FILM FESTIVAL

అయితే ఈ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శించబోతోన్నారని నిర్మాణ సంస్థ సోషల్ మీడియాలో పేర్కొంది. ఈ ట్వీట్ నాని రియాక్షన్ అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. మొహాన్ని తలకిందులుగా చేసిన ఓ ఎమోజీని షేర్ చేశాడు. అయితే అది ఆశ్చర్యమా? అనుమానమా? అని నెటిజన్లు ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు.

అనిరుద్ 'జెర్సీ' చిత్రానికి తన సంగీతంతో ప్రాణం పోయగా... సాను జాన్ వర్గీస్ ఛాయాగ్రహణం మరో ఆకర్షణగా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమాను హిందీలో షాహిద్ కపూర్ రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. అది కూడా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X