నాని విడుదల చేయనున్న శ్రీనివాస్ రెడ్డి సినిమా టీజర్!
ఇ. వి. వి సత్యనారాయణ దర్శకత్వంలో 1992 లో వచ్చిన ఒక విజయవంతమైన హాస్యభరిత సినిమా. ఇందులో నరేష్, ఆమని ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పుడు ఇదే పేరుతో నటుడు శ్రీనివాస్ రెడ్డి సినిమా చేస్తున్నాడు. మను ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి స్పందన లభిస్తోంది.
గీతాంజలి జయమ్ము నిశ్చయమ్మురా వంటి వైవిధ్యమైన కథలతో కథానాయకుడిగా రెండు విజయాలు అందుకున్న ప్రముఖ హాస్యనటుడు శ్రీనివాసరెడ్డి హీరోగా మరోసారి జంబలకిడి పంబ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కథకు సరిగ్గా సరిపోయే టైటిల్ కావడంతో ఈ సినిమాకు జంబలకిడి పంబ టైటిల్ ను పెట్టడం జరిగిందని సమాచారం.

హైదరాబాద్, ఈస్ట్ గోదావరి, వైజాగ్, అరకు, కేరళలో కీలక సన్నివేశాలను చిత్రీకరించిన ఈ సినిమా రొమాంటిక్ కామెడీ నేపద్యంలో తెరకెక్కింది. రేపు ఈ సినిమా టీజర్ ను హీరో నాని విడుదల చెయ్యబోతున్నాడు. పోసాని, వెన్నెల కిశోర్ ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు.


Click it and Unblock the Notifications











