'కూచిపూడి వారి వీధి'... తప్పుడు వార్తే అని కొట్టిపారేసిన నాని!
నేచురల్ స్టార్ నాని త్వరలో గీతా ఆర్ట్స్ బేనర్లో మరో సినిమా చేయబోతున్నారని, ఈ చిత్రానికి 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' ఫేం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించబోతున్నారని, ఈ మూవీకి 'కూచిపూడి వారి వీధి' అనే టైటిల్ ఖరారైనట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
తన ఫ్యాన్ పేజీలో జరుగుతున్న ఈ ప్రచారంపై నాని రియాక్ట్ అయ్యారు. ఈ వార్తల్లో నిజం లేదని, అది పూర్తిగా తప్పుడు న్యూస్ బోయ్స్ అంటూ రిప్లై ఇచ్చారు. దీంతో 'కూచిపూడి వారి వీధి' రూమర్లకు తెరపడినట్లయింది.
నాని హీరోగా నటించిన 'జెర్సీ' మూవీ ఇటీవల విడుదలై బాక్సాఫీసు వద్ద మంచి విజయం అందుకుంది. ప్రస్తుతం 'గ్యాంగ్ లీడర్' అనే చిత్రంలో నటిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో నాని ఓ దొంగల గ్యాంగుకు లీడర్‌గా కనిపించబోతున్నాడట.
నాని కెరీర్లో 25వ చిత్రం మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందుతోంది. నెల రోజుల క్రితం ప్రారంభోత్సవం జరుపుకున్న ఈ చిత్రానికి 'వి' అనే టైటిల్ ఫైనల్ చేశారు. ఈ మూవీలో నానితో పాటు సుధీర్ బాబు కీలక పాత్ర పోషిస్తున్నాడు. నివేథా థామస్, అదితి రావు హైదరి హీరోయిన్లు.

'వి' మూవీ దిల్ రాజు నిర్మిస్తుండటంతో అంచనాలు పెరిగాయి. అమిత్ త్రివేధి సంగీతం అందిస్తుండగా, పిజి విందా సినిమాటోగ్రఫీ హ్యాండిల్ చేస్తున్నారు. ఈ చిత్రంలో నాని విలన్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











