twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ సీన్ చేస్తున్నపుడు ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు.. నిజమైన రైల్వే స్టేషన్‌లో.. నాని!

    |

    Recommended Video

    Nani Reveals Interesting Details About Train Scene In Jersey || Filmibeat Telugu

    నేచురల్ స్టార్ నాని నటించిన జెర్సీ చిత్రం శుక్రవారం విడుదలైన సంగతి తెలిసిందే. గత ఏడాది నానికి పెద్దగా కలసి రాలేదు. నానికి అర్జెంట్ గా హిట్ అవసరం అన్న తరుణంలో గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన జెర్సీ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలయింది. తొలి షో నుంచే జెర్సీ చిత్రానికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. వసూళ్ల పరంగా కూడా జెర్సీ చిత్రం దూసుకుపోతోంది. ఇదిలా ఉండగా నాని ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ చిత్రంలోని రైల్వే స్టేషన్ సన్నివేశంలో తాను పడ్డ ఇబ్బందుల గురించి సరదాగా వ్యాఖ్యానించారు.

    బలమైన సీన్

    బలమైన సీన్

    నాని మాట్లాడుతూ.. హీరో క్రికెట్ టీంకు ఎంపికైన తర్వాత రైల్వే స్టేషన్ కు వెళ్లి ట్రైన్ వెళుతుండగా గట్టిగా అరుస్తాడు. గౌతమ్ నాకు ఈ సీన్ చెప్పగానే బలమైన సన్నివేశం.. ఆడియన్స్ ని తప్పకుండా మెప్పిస్తుంది అని అనుకున్నా. అందుకు తగ్గట్లుగా థియేటర్ లో రెస్పాన్స్ వస్తోందని నాని తెలిపాడు. దర్శకుడు గౌతమ్ మాట్లాడుతూ ఆ సన్నివేశాన్ని రాసేటప్పుడు ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందని ఊహించలేదని తెలిపాడు.

     3 గంటలు ఎదురుచూడాలి

    3 గంటలు ఎదురుచూడాలి

    జనాలు పెద్దగా లేని మారుమూల రైల్వే స్టేషన్ లో ఆ సన్నివేశాన్ని చిత్రీకరించినట్లు నాని తెలిపాడు. ఆ సీన్ నేచురల్ గా ఉండేందుకు నిజమైన రైల్వే స్టేషన్ ఎంచుకున్నాం. ఆ స్టేషన్ లో ఉందయం నుంచి సాయంత్రం వరకు కేవలం మూడు ట్రైన్లు మాత్రమే వెళతాయి. ఓ ట్రైన్ మిస్సయితే దాదాపు మూడుగంటలు మరో ట్రైన్ కోసం ఎదురుచూడాలి అని నాని తెలిపాడు.

    ‘జెర్సీ' కలెక్షన్ రిపోర్ట్: ఆరోసారి యూఎస్ఏ బాక్సాఫీస్ దద్దరిల్లే హిట్టు కొట్టిన నాని!‘జెర్సీ' కలెక్షన్ రిపోర్ట్: ఆరోసారి యూఎస్ఏ బాక్సాఫీస్ దద్దరిల్లే హిట్టు కొట్టిన నాని!

     సరిగ్గా అప్పుడే

    సరిగ్గా అప్పుడే

    హీరో ఎమోషన్ తో గట్టిగా అరిచే సన్నివేశం అది. డైలాగ్ అయితే ఒకసారి ప్రాక్టీస్ చేసుకుని వెంటనే చెప్పేయొచ్చు. కానీ ఆ సీన్ అలా కాదు. చాలా బాగా పండాలి. ట్రైన్ వస్తున్న సమయంలో అంతా సిద్ధం చేసుకుని రెడీగా ఉన్నాం. కానీ అదే సమయంలో మరో ట్రైన్ వచ్చి అడ్డంగా ఆగింది అని నాని తెలిపాడు. దీనితో ఆ ట్రైన్ పక్కకు తీసి మరో ట్రైన్ వచ్చేవరకు వేచిచూడాల్సి వచ్చిందని నాని తెలిపాడు.

     అత్యుత్తమ పెర్ఫామెన్స్

    అత్యుత్తమ పెర్ఫామెన్స్

    జెర్సీ చిత్రానికి ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖుల నుంచి కూడా ప్రశంసలు లభిస్తున్నాయి. నాని కెరీర్ లో ఇది బెస్ట్ పెర్ఫామెన్స్ అని ఎన్టీఆర్, రాజమౌళి, అల్లు అర్జున్ లాంటి సెలెబ్రిటీలంతా ప్రశంసించారు. జెర్సీ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. యూఎస్ లో అయితే జెర్సీ దూసుకుపోతోంది. ఇప్పటికే 1 మిలియన్ డాలర్ల వసూళ్ళని రాబట్టింది. నాని సరసన ఈ చిత్రం శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్ గా నటించింది.

    English summary
    Nani reveals interesting details about train scene in Jersey. Gawtam Tinnanuri is director of movie. Shraddha Srinath plays female lead
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X